సినిమా సెట్లో శోభనమా?.. అక్కడే సరిగమలు!

0

స్వామి కార్యం సకార్యం అంటారు! ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ ఆ పనిలోనే ఉన్నాడు! ఓవైపు రంగ్ దే షూటింగ్ చేస్తున్నాడు. మరోవైపు భార్యతో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. వర్క్ లైఫ్ వ్యక్తిగత జీవితానికి అడ్డంకి కాదని ప్రూవ్ చేస్తున్నాడుట.

అయితే ఈ సంగతి ఇంతవరకూ ఎవరూ లీక్ చేయలేదు. ప్రస్తుతం రంగ్ దే చిత్రీకరణ కోసం నితిన్ – కీర్తి సురేష్ జంట దుబాయ్ ట్రిప్ లో ఉంది. అక్కడ నితిన్ భార్యామణి షాలిని కూడా ఉన్నారట.

ఇలా షూట్ పూర్తవ్వగానే ఈ జంట అలా షికార్ కి వెళ్లిపోతున్నారట. దుబాయ్ అందాల్ని నితిన్ తన సతీమణికి దగ్గరుండి మరీ చూపిస్తున్నారట. ఇక ఈ జంటకు సపరేట్ గా ఓ స్టార్ హోటల్ సూట్ కూడా బుక్ చేయడంతో అక్కడే సరిగమలు ఆడేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త జంటలతో ఇదేగా తంటా! అంటూ చిత్రబృందం నితిన్ ని ఏడిపించేస్తున్నారట. ప్రస్తుతం దుబాయ్ పర్యటన నుంచి నితిన్ – షాలిని జంట అదిరిపోయే ఫోటోల్ని లీకులిస్తుండడంతో అసలు సంగతి లీకైపోయింది మరి. మహమ్మారీ షూటింగుల్ని చెడగొట్టడమే గాక ఎలిజిబుల్ బ్యాచిలర్లందరినీ ఓ ఇంటి వాళ్లను చేసింది. థాంక్స్ టు కరోనా!!