నితిన్ మూవీలో నటించడానికి ఆ స్టార్ హీరోయిన్ ఒప్పుకుందా…?

0

టాలీవుడ్ యువ హీరో నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న ‘అంధాదున్’ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా – రాధికా ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించబోయే తెలుగు రీమేక్ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డిలు మరియు ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటించనుందని సమాచారం.

అయితే హిందీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న టబు పాత్రని తెలుగులో ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా టబు నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రమ్యకృష్ణ – అనసూయ – శిల్పాశెట్టి – నయనతార పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయా సరన్ ని ఆ రోల్ కోసం ఫైనలైజ్ చేశారట. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన శ్రీయాకి ఈ పాత్ర కోసం భారీగానే ముట్టజెప్తున్నారట. ప్రస్తుతం తెలుగులో ‘ఆర్.ఆర్.ఆర్’ లో నటిస్తున్న శ్రేయా.. తమిళ్ సినిమాతో పాటు ఒక హిందీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్న నితిన్.. ఈ సినిమా మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి ‘అంధాదున్’ తెలుగు రీమేక్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.