బిబి4 డే2 : కట్టప్ప ఎవరు.. అదే ఏడుపు.. గ్లోరి సోహైల్ గరం గరం ఎంట్రీ

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రెండవ రోజు సాదా సీదాగా సాగింది. ఒకటి రెండు గొడవలు.. కాస్త ఫన్ చివర్లో అరియానా గ్లోరి మరియు సోహెల్ లు సీక్రెట్ రూం నుండి బయటకు రావడం వంటివి ఎపిసోడ్ నెం.3 లో కనిపించాయి. ఇంటి సభ్యులు రెండవ రోజు చాలా ఉల్లాసంగా గడిపారు. రోజు ప్రారంభంలో కళ్యాణి తో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇంటి నియమాల గురించి చెప్పించాడు. ఆ సమయంలో కాస్త ఫన్ చోటు చేసుకుంది. గంగవ్వ తనదైన అమాయకత్వపు మాటలతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మీలో ఒక కట్టప్ప ఉన్నారు. ఆ కట్టప్ప ఎవరో ఒక కంట కనిపెడుతూనే ఉండండి అంటూ బిగ్ బాస్ హెచ్చరించి మరీ షో ను మరింతగా రక్తి కట్టించాడు.

మీ మీ అభిప్రాయం ప్రకారం కట్టప్ప ఎవరు అనుకుంటున్నారు అనే విషయాన్ని తెలియజేయాలంటూ ఓటింగ్ పెట్టారు. ఆ సీక్రెట్ ఓటింగ్ లో చాలా మంది సూర్య కిరణ్.. అఖిల్ పేర్లు రాశారు. కట్టప్ప స్టోరీ ఏంటీ అసలు ఎవరు అనే విషయం ప్రేక్షకులకు కూడా తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సీక్రెట్ రూంలో ఉన్న అరియానా గ్లోరి మరియు సోహెల్ లకు ఇంటి సభ్యులు ఫుడ్ పంపేందుకు నో చెప్పారు. ఫోన్ లో అరియానా ఫుడ్ కావాలంటూ విజ్ఞప్తి చేసినా కూడా రిక్వెస్ట్ గా అడగకుండా ఏంటీ ఈ దౌర్జన్యం అంటూ గ్లోరిపై నోయల్ అసహనం వ్యక్తం చేసి ఫోన్ పెట్టేశాడు. దాంతో సోహెల్ మరియు గ్లోరికి ఫుడ్ కట్ అయ్యింది. కళ్యాణి.. అభిజిత్ ల మద్య గొడవ జరగడం అది వెంటనే సర్దుకోవడం జరిగింది.

మొదటి ఎపిసోడ్ మాదిరిగానే రోజవ రోజు కూడా హీరోయిన్ మోనాల్ గజ్జర్ కన్నీరు పెట్టుకుంది. ఆమె ఎందుకు ఏడిచింది అనేది ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం. గతంలో శివ జ్యోతికి కారణం అయినా ఉండేది ఏడ్చేందుకు. కాని మోనాల్ కు మాత్రం కారణం కూడా అక్కర్లేదు అంటూ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నిన్న మొత్తం ఎపిసోడ్ లో దివి కనిపించింది కాని ఫుటేజ్ మాత్రం ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఇలా అయితే ఎలా అంటూ ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారు కాస్త టెన్షన్ లో ఉన్నట్లుగా అనిపించింది. ఇక నేటి ఎపిసోడ్ లో సోహల్ మరియు అభిజిత్ ల మద్య గొడవ కాస్త ఎక్కువగానే జరుగుతుందని ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది.