నూటొక్క జిల్లాల అందగాడు తో హిట్ కొట్టాలనా?

0

టైటిల్ తోనే ఆకట్టుకుంటే కచ్ఛితంగా ఆ ఇంపాక్ట్ ఓపెనింగులపై తప్పనిసరిగా ఉంటుంది. ఇది ప్రూవ్డ్ టాస్క్. ఇక అవసరాల శ్రీనివాస్ లాంటి తెలివైన నటుడు కం దర్శకుడు టైటిల్ ఎంపిక కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

అవసరాల నటిస్తున్న తాజా చిత్రం `నూటొక్క జిల్లాల అందగాడు. ఇందులో చిలసౌ ఫేం రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. `హిట్` మూవీ తర్వాత రుహానీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. కోవిడ్ నియమనిబంధనల ప్రకారం ఎంతో జాగ్రత్తగా చిత్రీకరణ సాగిస్తున్నారు.

అవసరాల కామెడీ టింజ్.. రుహానీ గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ అనడంలో సందేహమేం లేదు. టైటిల్ కి తగ్గట్టే ఫన్ లవ్ ఎంటర్ టైన్ మెంట్ ని ఆశించవచ్చు. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు- క్రిష్ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. శిరీష్- రాజీవ్ రెడ్డి- సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.