ముంబైకొస్తున్నా..దమ్ముంటే ఆపుకో! కంగన బస్తీ మే సవాల్!!

0

ఫేస్ టు ఫేస్ .. హ్యాండ్ టు హ్యాండ్ .. చూస్కుందామా నీ పెతాపమూ నా పెతాపమూ? దివంగత విలన్ కం కమెడియన్ జయప్రకాష్ రెడ్డి డైలాగ్ లా ఉంది కదూ? కానీ ఇంచుమించు ఇలానే సవాల్ చేసింది క్వీన్ కంగన రనౌత్. ముంబైలో తన ఇంటిని కూల్చేందుకు సిద్ధమైన బీఎంసీని.. లోకల్ నాయకుల్ని కలిపి ఈ అమ్మడు ఓ రేంజులో ఎటాక్ చేస్తోంది.

ముంబై గల్లీకి వస్తున్నా.. చూస్కుందామా నీ పెతాపమూ నా పెతాపమూ!! అంటూ శివసేన కీలక నేత పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ నే ఎదిరించింది. తనను ముంబైకి తిరిగి రావద్దంటూ బెదిరించిన ఆయనపై కౌంటర్ ఎటాక్ కి దిగింది క్వీన్.

“ముంబైకి తిరిగి రాకూడదని చాలా మంది బెదిరిస్తున్నారు. ఐ డోంట్ కేర్.. సెప్టెంబర్ 9 న ముంబైకి వస్తున్నా.. ఎవరికైనా దమ్ముంటే ఆపుకోండి“ అంటూ ఓపెన్ సవాల్ చేసింది. హిమచల్ ప్రదేశ్ మనాలిలో ఎంతో మోజుపడి కట్టుకున్న ఇంట్లో ప్రస్తుతం కంగన తల దాచుకుంది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా అభివర్ణించిన కంగన డేర్ కి జనం ఫిదా అయిపోయారు.

ఇక మనాలి ఇంటి నుంచి బయల్దేరే ముందే కరోనా పరీక్షలు చేయించుకుందట. కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక క్వీన్ ఫిక్స్ చేసిన ముహూర్తం ప్రాకరం ముంబైలో అడుగుపెడుతుంది. మరి శివ సైనికుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఉంటుందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.