Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఫ్యామిలీ స్టార్‌ కి వీసా కష్టాలు!

ఫ్యామిలీ స్టార్‌ కి వీసా కష్టాలు!


రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్‌. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. గీత గోవిందం సినిమా తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమా అవ్వడం తో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు చాలా నమ్మకంగా చెబుతున్నాడు.

ఇక ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని చాలా పట్టుదలతో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు షూటింగ్‌ 50 శాతం మాత్రమే పూర్తి అయింది. మిగిలిన బ్యాలన్స్ షూటింగ్‌ ను నవంబర్ మరియు డిసెంబర్‌ లో పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. సినిమాలోని మేజర్‌ షెడ్యూల్‌ ను యూఎస్ లో ప్లాన్‌ చేశారు.

యూఎస్ కి ఫ్యామిలీ స్టార్‌ యూనిట్‌ సభ్యులు వెళ్లేందుకు వీసా సమస్య ఉంది. అందరికీ వీసాలు రావడానికి కనీసం నెల సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే వెంటనే విదేశీ షెడ్యూల్‌ ను మొదలు పెట్టాలి అనే ఉద్దేశ్యంతో యూఎస్‌ ని కాదు అనుకుని బ్యాంకాక్ కి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

బ్యాంకాక్‌ లో కీలక సన్నివేశాల చిత్రీకరణతో మెజార్టీ షూటింగ్ పూర్తి అవుతుంది. డిసెంబర్‌ లో బ్యాలన్స్ షూట్‌ ను ముగించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా తీసుకు రావాలని నిర్మాత దిల్‌ రాజు భావిస్తున్నాడు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై రౌడీ స్టార్‌ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుని వెయిట్‌ చేస్తున్నారు.