Templates by BIGtheme NET
Home >> Cinema News >> వరుణ్ లావణ్య లవ్ స్టోరీ.. అంతా సీక్రెట్ గానే..

వరుణ్ లావణ్య లవ్ స్టోరీ.. అంతా సీక్రెట్ గానే..


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మ్యారేజ్ ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. ఇటలీలో మధ్యాహ్నం 2:48 గంటలకు వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా అక్కడకు వెళ్లగా కొందరు మెగా ఫ్యామిలీ సన్నిహితులు కూడా అక్కడకు వెళ్లారు. పెళ్లిబంధంతో ఒకటవుతున్న వరుణ్ లావణ్యలను ఆశీర్వధించనున్నారు.

హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి సినిమాలో నటించగానే ఇద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ రిలేషన్ షిప్ అంటకట్టేస్తారు. కానీ ఎప్పుడు కూడా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల మధ్య రిలేషన్ షిప్ గురించి ఎలాంటి వార్తలు రాలేదు. 2017 లో మిస్టర్ సినిమాలో కలిసి నటించిన వరుణ్ తేజ్ లావణ్య ఇద్దరికి ఆ సినిమాతోనే పరిచయం ఏర్పడింది. ఇటలీలోనే ఆ సినిమా షూటింగ్ జరగడం విశేషం.

ఇక ఆ సినిమా టైం లో ఫ్రెండ్స్ గా మారిన వీరిద్దరు మళ్లీ అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు. ఆ టైం లోనే వీరిద్దరు ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. మెగా హీరోనే లావణ్యకు తన ప్రేమని ఎక్స్ ప్రెస్ చేసినట్టు తెలుస్తుంది. ఫస్ట్ వరుణ్ తేజ్ తన ఇంట్రెస్ట్ ఎక్స్ ప్రెస్ చేస్తే ఆ తర్వాత లావణ్య తన ఇష్టాన్ని తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాదు లావణ్య త్రిపాఠి నిహారిక జిమ్ పార్ట్ నర్ కూడా.. అందుకే వరుణ్ తేజ్ తో ఈక్వల్ గా నిహారికకు లావణ్య క్లోజ్ అయ్యింది.

నిహారిక పెళ్లిలో కూడా లావణ్య సందడి చేసిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ మీద ఇష్టాన్ని ఎప్పటికప్పుడు తెలుపుతూ వచ్చింది లావణ్య త్రిపాఠి. తను చేసిన ఏ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ అయినా ఇష్టమైన హీరో అనగానే వరుణ్ తేజ్ పేరు చెప్పింది లావణ్య. అయితే ఆ టైం లో ఆమె డౌట్ రాకుండా చాలా క్లవర్ గా మ్యానేజ్ చేసింది. ఐదారేళ్లుగా ప్రేమలో ఉన్నా సరే వరుణ్ లావణ్య ఒక్కసారి కూడా మీడియా కంట పడలేదు.

అంత సీక్రెట్ గా వారి లవ్ స్టోరీ నడిపించారు. మొత్తానికి ఇన్నేళ్ల ప్రేమ ఫలించింది. వరుణ్ తేజ్ ని పెళ్లాడి మెగా ఇంటి కోడలు అవుతుంది లావణ్య త్రిపాఠి. వరుణ్ తేజ్ లావణ్య ప్రీ మ్యారేజ్ ఈవెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా హీరోలంతా కలిసి సందడి చేస్తున్న ఈ ఫోటోలు మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి.