Templates by BIGtheme NET
Home >> Cinema News >> జియో వరల్డ్‌ లో జాన్వీ అందాల వేడి

జియో వరల్డ్‌ లో జాన్వీ అందాల వేడి

అలనాటి తార శ్రీదేవి కూతురిగా సిల్వర్​ స్క్రీన్​కు పరిచయమైన నటి జాన్వీ కపూర్‌. తక్కువ సినిమాల్లోనే నటించినా క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషిస్తోంది. సినిమాల్లో ప్రామినెంట్ రోల్స్​ చేస్తూనే.. సోషల్​ మీడియాలో బయట గ్లామర్​ను బాగా ఆరబోస్తుంటుంది. తాజాగా మరోసారి ర్యాంప్ వాక్ చేస్తూ తన అందాలను ఆరబోసింది.

వివరాళ్లోకి వెళితే.. ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన భారతదేశంలోని అత్యంత ఖరీదైన వాణిజ్య వ్యాపార కేంద్రాలు నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్. తాజాగా ఇప్పుడు వీటి పక్కన జియో వరల్డ్‌ ప్లాజా రిటైల్‌ మాల్‌ను ముంబయిలో గ్రాండ్​గా ప్రారంభించారు.

ఈ మాల్​ను రిలయన్స్ ఇండస్ట్రీస్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో 750,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ స్థాయిలో నిర్మించారు. సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ మాల్‌ను ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దారు. అయితే ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. పలువురు డిజైనర్లు గ్రాండ్​గా రూపొందించిన డిజైనర్‌ వస్త్రాల్లో వీళ్లంతా మెరిశారు.

ఈవెంట్​లో వీళ్లంతా స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. వీరిలో జాహ్నవి కపూర్‌, సోనమ్‌ కపూర్‌, కరిష్మా కపూర్‌, నోరా ఫతేహి, దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, అలియాభట్‌, తమన్నా భాటియా, విజయ్‌ వర్మ, శోభితా దూళిపాళ్ల, రష్మికా మందన్నా, సునీల్‌, అతియా శెట్టి, కరణ్‌ జోహార్‌, జాన్‌ అబ్రహం సహా పలువురు ఉన్నారు.

అయితే వీరిలో జాన్వీ కపూర్ మరింత స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. సిల్వర్ కలర్ డిజైన్డ్​ డ్రెస్​లో జ్యువెలరీ ధరించి యమా స్టైలిష్​గా మెరిసింది. మెరూన్ లిప్​స్టిక్​, డ్రెస్​ వెనక మెరూన్ కలర్​ పరదాను, మెరూన్ జ్వూవెలరీ అంతా మ్యాచింగ్​ వేసుకుని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్​గా మారాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ పిక్స్​ను బాగా ట్రెండ్ చేస్తున్నారు. తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ  దేవర చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి లుక్​ కూడా విడుదలై బాగా ఆకట్టుకుంది.

Share via
Copy link