ఈ ముద్దుగుమ్మల డాన్స్ చూడ్డానికి రెండు కళ్లు చాలవు

0

డాన్స్ రియాల్టీ షోల్లో అప్పుడప్పుడు జడ్జ్ లు డాన్స్లు చేయడం చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం. అయితే సోనీ ఛానెల్ లో ప్రసారం అయ్యే ఇండియాస్ బెస్ట్ డాన్సర్ షో లో స్టార్స్ చేసిన డాన్స్ క్లిప్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇండియాస్ బెస్ట్ డాన్సర్ షో కు మలైకా అరోరా జడ్జ్ గా వ్యవహరిస్తుంది. అయితే స్టేజ్ పై ఆమె డాన్స్ చేయడం చాలా రేర్ గా జరుగుతుంది. ఒక వేళ చేసినా ఒకటి రెండు స్టెప్పులు సింపుల్గా వేసేస్తుంది. కాని ఈసారి తనకు ఇష్టమైన మున్నీ బద్నాం సాంగ్ కు డాన్స్ ఇరగదీసింది.

కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే ఎందుకు డాన్స్ చేయాలి. ఈ సారి నేను డాన్స్ చేశాను. ఈ రోజు ఎపిసోడ్ ను మాత్రం ఎట్టి పరిస్థతుల్లో మిస్ అవ్వద్దంటూ సూచించింది. ఇదే సమయంలో ఆమె న్యూ మున్నీ అంటూ తనకు తాను కితాబిచ్చుకుంది. ఈ పాటకు ఆమె నోరా ఫతేహీతో కలిసి డాన్స్ చేసింది. షో లో నోరా కంటెస్టెంట్ గా ఉంది. ఆమె చేసిన డాన్స్ నచ్చడంతో దబాంగ్ లోని మున్నీ పాటకు మరోసారి స్టెప్పులు వేయాలనిపించడంతో మలైకా ఆగకుండా స్టెప్పులు వేసేసింది. ఈ ముద్దుగుమ్మల డాన్స్ చూడ్డానికి రెండు కళ్లు చాలవు… ఈ వారం షోకు మలైక కారణంగా భారీ రేటింగ్ అయితే రావచ్చు అంటూ వీక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.