ఇప్పుడు ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో…?

0

నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఇప్పటి వరకు 25 చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం హిట్ అయిన సినిమాలే. అందుకే నాని సినిమా అంటే మినిమమ్ ఉంటది అనే నమ్మకం కలిగించాడు. ఇక నాని తో సినిమాలు తీసి హిట్స్ అందుకున్న దర్శకులు బాగానే కెరీర్ సాగిస్తున్నారు. అయితే ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. టాలెంటెడ్ యాక్టర్ నాని ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారని ప్లాప్ సినిమాలు తీసిన డైరెక్టర్లకి పెద్దగా అవకాశాలు ఉండవని అంటుంటారు. ఇండస్ట్రీలో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే తప్ప నానితో ఫ్లాపులు తీసిన డైరెక్టర్స్ కు మళ్లీ అవకాశాలు రావడం కష్టమని అభిప్రాయపడుతుంటారు.

కాగా నానితో ‘పైసా’ సినిమా తీసిన డైరెక్టర్ కృష్ణవంశీకి ఆ తర్వాత హిట్ అనేది అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. గతంలో నానితో ‘కృష్ణార్జున యుద్ధం’ తీసి ఫ్లాప్ కొట్టిన డైరెక్టర్ మేర్లపాక గాంధీకి మళ్లీ మరో సినిమా రావడానికి రెండేళ్లు పట్టింది. అయితే ఇప్పుడు నానితో ‘వి’ సినిమా తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ పరిస్థితి ఏమవుతుందో అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ నానితో గతంలో ‘అష్టాచమ్మా’ ‘జెంటిల్ మెన్’ అనే సినిమాలు తీసి మంచి సక్సెస్ సాధించాడు. ఈ క్రమంలో వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా నాని కెరీర్లో 25వ సినిమాగా వచ్చిన ‘వి’ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. థ్రిల్లింగ్ అంశాలు లేని థ్రిల్లర్ గా రొటీన్ రివేంజ్ డ్రామా తో ఓటీటీ ఆడియన్స్ కి బోర్ కొట్టించారని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇక ‘సమ్మోహనం’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత ఇంద్రగంటి నుంచి ఇలాంటి మూవీ ఎక్సపెక్ట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇంద్రగంటి కూడా నాని ప్లాప్ దర్శకుల సెంటిమెంట్ ను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని డౌట్ పడుతున్నారు. అయితే ఇంద్రగంటి మోహనకృష్ణ రెండు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడని వార్తలు వచ్చాయి. యువసామ్రాట్ నాగచైతన్యతో ఒకటి.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఉండబోతున్నాయని అనుకున్నారు. కాకపోతే వీటి గురించి ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే ‘వి’ ఇలాంటి రిజల్ట్ అందుకున్నాక ఆ రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడు డౌటే అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.