‘నారప్ప’ షూటింగ్ అప్డేట్

0

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ మూవీని తెలుగులో నారప్ప అంటూ వెంకటేష్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ను ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేయడం జరిగింది. సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అవుతోంది. ఆరు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న వెంకటేష్ ఇప్పుడు షూటింగ్ కు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు సురేష్ బాబు షూటింగ్స్ వద్దనుకున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘నారప్ప’ను షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.

షూటింగ్ ను వచ్చే నెల నుండి పునః ప్రారంభించి నవంబర్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ పనిమీదే ఉన్నాడట. పూర్తి జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగ్ జరుపబోతున్నారట. కేవలం 25 నుండి 35 మంది మాత్రమే షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే నారప్పను విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టకునేలా నారప్ప ఉంటుందంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.