స్టార్స్ పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

0

చిత్రసీమలో హిపోక్రసీ అన్నివేళలా హాట్ టాపిక్. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడం ఇక్కడో ఆర్ట్. వెండితెర నాటకాన్ని రియల్ లైఫ్ లోనూ అనుసరిస్తుంటారు. స్టార్స్ గురించి పచ్చి నిజాలు తెలిసినా.. నిజ జీవితంలో క్యారెక్టర్ పరమ వేస్ట్ అని తేలినా.. వేదికల ముందు మాత్రం వారి గురించి ఉన్నతంగా చెప్పడం ఇక్కడ నిత్యకృత్యం. నిజాలు మాట్లాడే వారు.. నిజంలో బ్రతికే వారు ఇక్కడ తక్కువే. అంతా అబద్దం అయినా అదే నిజం అని చెప్పే ఘనులే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తారు.

ఈ హిపోక్రసీపై తాజాగా ఓ యంగ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. `స్నేహ గీతం` సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రేయాధన్వంతరి తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ వైరల్ గా మారింది. నటిని కావడానికి తాను దాదాపు తొమ్మిదేఏళ్లు అవిశ్రాంతంగా పనిచేయాల్సి వచ్చిందని.. అవార్డు వేడుకల్లో స్టార్స్ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని కుండ బద్దలు కొట్టింది.

ఇమ్రాన్ హష్మీతో `వైజీట్ ఇండియా`.. ఆ తరువాత `ది రీయూనియన్`.. లేడీస్ రూమ్` వంటి వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్న శ్రియ ధన్వంతరి అవార్డు వేదికలపై `ఎంతకష్టమైనా మీరెంచుకున్న దారి వదలకండి` అంటూ చెప్పుకొచ్చింది. సేమ్ టైమ్ స్టార్ల లోగుట్టు విప్పేసింది. స్టార్స్ చెప్పే మాటల్లో నిజం లేదని ఆ మాటలు పచ్చి అబద్ధాలని ఘాటుగా స్పందించింది. అసలు స్టార్స్ చెప్పే విషయాల్లో నిజం అనేదే వుండదని.. వారి మాటల్లో వున్నట్టుగా చేతల్లో వుండదని సంచలన వ్యాఖ్యలు చేసింది.