`పుష్ప`లో ఊహకందని స్టార్.. ఇంతకీ ఎవరా లక్కీ హీరో?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పంథా ఏమిటో కానీ ఇటీవల తన సినిమాల్లో సాటి హీరోలకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు నవదీప్ .. శివ బాలాజీ.. సుశాంత్ లాంటి హీరోలకు అవకాశాలిచ్చాడు. బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఛాన్సులందుకున్న ఈ హీరోలంతా ఆ తర్వాత కెరీర్ పరంగా ప్లానింగుని మార్చే ప్రయత్నం చేశారు.

ఈసారి పుష్ప చిత్రంలో ఓ యంగ్ హీరో జాక్ పాట్ కొట్టేశారట. ఇంతకీ ఎవరా ఊహకందని స్టార్? అంటే.. నారా రోహిత్. అల్లు అర్జున్ స్నేహితుడిగా `పుష్ప` చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. బన్నినే స్వయంగా ఆ పేరును సుకుమార్ కి సూచించాడట. అంతేకాదు.. ఆ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువేనట. రంగస్థలం లో ఆది పినిశెట్టి పాత్రలా కీలకంగా ఉంటుందట.

త్వరలోనే పుష్ప రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలా కొత్త పేర్లు రివీల్ కావడం ఉత్కంఠను పెంచుతోంది. ఇందులో వేర్వేరు గెటప్పులతో సర్ ప్రైజ్ ట్రీటివ్వనున్న సంగతి తెలిసిందే. అయితే `అల వైకుంఠపురములో` చిత్రంలో సుశాంత్ .. నవదీప్ పాత్రలతో పోలిస్తే పుష్పలో నారా రోహిత్ పాత్ర పరిధి ఏ మేరకు హైలైట్ అవుతుంది? అన్నది సుకుమారే చెప్పాల్సి ఉంటుంది.