సూయ సూయ అనసూయ ఏమిటీ కవ్వింపు?

0

వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీస్తే అందులో కీలక పాత్ర పోషించారు అనసూయ భరద్వాజ్. మహి.వి దర్శకత్వం వహించిన `యాత్ర`లో రొటీన్ కి భిన్నమైన పాత్రతో ఆకట్టుకున్నారు ఈ సీనియర్ హాట్ యాంకర్. కర్నూల్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) గౌరు చరితారెడ్డిగా ఛమక్కుమనిపించే పాత్రలో మెప్పించారు. మమ్ముట్టి లాంటి సీనియర్ స్టార్ వైయస్ పాత్రలో కనిపిస్తే ఇందులో కాస్త డీగ్లామర్ పాత్రతో ఎమోషనల్ సీన్ లో ఆకట్టుకున్నారు.

యాత్ర మూవీలో చీరకట్టులో అనసూయ కనిపించిన తీరు .. నటించిన వైనం హాట్ టాపిక్ అయ్యింది అప్పట్లో. రంగస్థలం రంగమ్మత్తగా విలక్షణమైన పాత్రతో మెప్పించిన అనసూయ .. ట్రాన్స్ ఫర్మేషన్ కూడా ఆకట్టుకుంది. రాజకీయాల్లో అనసూయంని బాగానే ఓన్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఇక లెంగ్తీ రోల్ కాకపోయినా తన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చినందుకు అనసూయ హ్యాపీ ఫీలయ్యారు.

ప్రస్తుతం బన్ని పుష్ప లో సుకుమార్ ఎమోషన్ తో కట్టిపడేసే పాత్రలోనే అవకాశం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే పుష్ప తో పాటు పలు చిత్రాల్లో అనసూయకు అవకాశాలు క్యూ కడుతున్నాయన్న సమాచారం ఉంది. ఏదేమైనా తన రేంజు తగ్గకుండా లేటెస్ట్ ఫోటోషూట్లతో అనసూయ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. తాజాగా ఇన్ స్టాలో అనసూయ షేర్ చేసిన ఫోటో అంతే వైరల్ గా మారుతోంది.

కాస్కో దిస్ వీక్.. .. ఐ మీన్ టుడే.. ఐ మీన్ రైట్ వేఔ గో చెక్ ఇట్ ఔట్!!! థాంక్యూ టీమ్ .. కాస్కో ఫర్ ది కెమెరా.. అంటూ.. అనసూయ కాస్త ఎగ్జయిటింగ్ గానే ఈ ఫోటోని షేర్ చేశారు. మేకప్ హెయిర్ స్టైల్ లుక్ పరంగా అనసూయ స్టన్నింగ్ మేకోవర్ ఆకట్టుకుంటోంది. అన్నట్టు అనసూయ మేకోవర్ చూస్తుంటే ఆ చీరకట్టులో ఎంతో డిగ్నిఫైడ్ గా ఉన్నారు. వైయస్ విజయమ్మ బయోపిక్ తీస్తే అందులో టైటిల్ రోల్ ఆఫర్ చేస్తే సూటబుల్ గానే ఉంటుందేమో!