వావ్ స్టైలిష్ కొమురం భీమ్

0

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడు.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయమై క్లారిటీ ఇచ్చారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. సూపర్ బాడీ తో పాటు వీడియోలో చివర్లో వచ్చిన షాట్ చాలా సింపుల్ గా ఆకట్టుకుంది. కొమురం భీమ్ గా నిన్న మొన్నటి వరకు సందడి చేస్తున్న ఎన్టీఆర్ ఈసారి స్టైలిల్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సెలెక్ట్ డాడ్జెట్స్ కు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. దానికి సంబంధించిన దీపావళి పోస్టర్ ను విడుదల చేశారు. దీనిలో ఎన్టీఆర్ చాలా కూల్ అండ్ స్టైల్ లుక్ లో కనిపిస్తున్నాడు. సెలెక్ట్ కోసం ఎన్టీఆర్ ఎప్పుడు కనిపించినా కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ విషయంలో ఆయన అభిమానులను ఎప్పుడు సంతృప్తి పర్చుతూ వస్తున్నాడు. ఈసారి స్టైలిష్ లుక్ తో మరింతగా అదరగొడుతున్నాడు. స్టైలిష్ గాడ్జెట్స్ తో ఎన్టీఆర్ మరింత స్టైల్ గా కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ హెయిర్ స్టైల్ మరియు బ్లాక్ జాకెట్ లో ఎన్టీఆర్ సూపర్ అంటూ నందమూరి అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.