Templates by BIGtheme NET
Home >> Cinema News >> జెమినీ షో: ఎన్టీఆర్ పారితోషికం తెలిస్తే నోరెళ్లబెడతారు!

జెమినీ షో: ఎన్టీఆర్ పారితోషికం తెలిస్తే నోరెళ్లబెడతారు!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వెండి తెరపై నవరసాలూ పలికిస్తూ చెలరేగిపోయే జూనియర్.. బుల్లితెర మీద కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. స్టార్ మా ప్రసారం చేస్తున్న ‘బిగ్ బాస్’ షో ఆరంభ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన తారక్.. చివరి వరకు ప్రేక్షకుల అటెన్షన్ ఆ షోపైనే ఉండేలా చేశాడు. అయితే.. తాజాగా జెమినీ టీవీ కూడా ఓ కొత్త షోను స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది. దీనికి హోస్ట్ గా జూనియర్ ను ఎంచుకున్న విషయం కూడా తెలిసిందే.

60 ఎపిసోడ్లు.. 30 లక్షలు..
జెమిని టీవీలో షో చేసేందుకు జూనియర్ ఇప్పటికే సైన్ చేశారు కూడా. మరో రెండు నెలల్లో షూట్ ప్రారంభమవుతుందని తాజా సమాచారం. అయితే.. ఇది ఎలాంటి షో? అనే చర్చ మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం.. కొంచెం డ్రామా కొంచెం సీరియస్ నెస్ కలగలసిన ఒక క్విజ్ షో మాదిరిగా ఉంటుందట. ఈ షోను మొత్తం 60 ఎపిసోడ్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి ఎపిసోడ్కు గానూ ఎన్టీఆర్ కు రూ.30 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. అంటే 60 ఎపిసోడ్లకు కలిపి మొత్తం రూ.18 కోట్లు తీసుకోబోతున్నాడట యంగ్ టైగర్. తెలుగు బుల్లితెర మీద ఇప్పటి వరకూ ఏ నటుడైనా అందుకుంటున్న పారితోషికం కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ అంటున్నారు విశ్లేషకులు.

ఆర్ఆర్ఆర్ తర్వాతనే..
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో తారక్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ గిరిజన యోధుడు కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతని పాత్రకు సంబంధించిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసిన తర్వాత.. జెమినీ సెట్లో అడుగుపెట్టనున్నాడు తారక్. అయితే.. ఈ షో వల్ల త్రివిక్రమ్ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మూవీ రాాబోతున్న విషయం తెలిసిందే. జూనియర్ చేయబోతున్న షో వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతుందని టాక్. త్రివిక్రమ్ గత సినిమా ‘అల వైకుంఠపురంలో’ విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఇప్పుడు ఈ షో వల్ల రాబోయే మూవీ మరింత ఆలస్యం అవుతుందనే చర్చ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.