Templates by BIGtheme NET
Home >> Cinema News >> మరోసారి ఇంకో హీరోతో ఎన్టీఆర్ స్ర్కీన్ షేర్?

మరోసారి ఇంకో హీరోతో ఎన్టీఆర్ స్ర్కీన్ షేర్?


ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ మరో యంగ్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ తోనే కాకుండా అంతకు ముందు ఎన్టీఆర్ తన సినిమాల్లో పలువురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమా లో పలువురు హీరోలు విలన్ గా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించిన దాఖలాలు చాలా ఉన్నాయి. మరో సారి ఎన్టీఆర్ మరో యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటాడనే వార్తలు వస్తున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చిన ఆ సినిమా కథ అనుసారం ఒక యంగ్ హీరో సినిమాలో నటించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం టాలీవుడ్ లేదా కోలీవుడ్ యంగ్ నోటెడ్ హీరోను ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్.. కొరటాల శివల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజీ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో యంగ్ హీరోను తీసుకు రాబోతున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పాన్ ఇండియా మూవీగా ఎన్టీఆర్.. కొరటాల శివల కాంబోలో రూపొందబోతున్న సినిమాలో ఆ పాత్రను బాలీవుడ్ నటుడితో చేయించినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతానికి ఆ పాత్ర ఎవరు చేస్తారు అనే విషయమై క్లారిటీ లేదు. కాని ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నటీ నటుల ఎంపిక జరుగుతుంది. త్వరలోనే ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనేది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి సినిమాలో నటించబోతున్న యువ నటుడు ఎవరు అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.