Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఇంట్లో ఎదిరించి డోనాని పెళ్లాడిన సౌరవ్ నగ్మతో ప్రేమలో ఎందుకు పడ్డాడు?

ఇంట్లో ఎదిరించి డోనాని పెళ్లాడిన సౌరవ్ నగ్మతో ప్రేమలో ఎందుకు పడ్డాడు?


మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్ సాగించిన అందాల కథానాయిక నగ్మ గురించి అప్పట్లో సంచలన కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇది దాచేందుకు ప్రయత్నించినా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఈ జంట తమ సంబంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడకపోయినా.. వారి మధ్య సంబంధంపై గుసగుసలు హాట్ టాపిక్ అయ్యేవి. గంగూలీ అప్పటికే డోనాను ప్రేమించి వివాహం చేసుకుని నగ్మతో ఎఫైర్ సాగించడం సంచలనం అయ్యింది.

అయితే నగ్మతో బంధం గురించి ముందే ఓపెన్ కాలేదు. సౌరబ్ నుంచి విడిపోయిన అనంతరం నగ్మ ఓ ఇంటర్వ్యూ లో ఓపెనైంది. అప్పటికే సౌరవ్ కెరీర్ పరంగా మాంచి స్పీడ్ లో ఉన్నారు. కానీ తమ ప్రేమాయణం అతడిని ప్రభావితం చేస్తున్నందున సంబంధం కట్ అయిందని నగ్మ పేర్కొంది. నిజానికి ఆ కీలక సమయంలో డోనా-గంగూలీ-నగ్మ ముక్కోణ ప్రేమకథ చాలా భయాందోళనలను సృష్టించింది. 1997 లో గంగూలీ తన చిన్ననాటి స్నేహితురాలు భాగస్వామి డోనాను ఫ్యామిలీని వ్యతిరేకించి మరీ వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన 2 సంవత్సరాల తరువాత 1999 లో ప్రపంచ కప్ సందర్భంగా నగ్మ – సౌరవ్ గంగూలీ కలుసుకున్నారు. అనేక నివేదికల ప్రకారం.. చెన్నై నుండి కొంచెం దూరంలో ఒక ఆలయంలో ఇద్దరూ కలిసి కనిపించారు. ఈ సంఘటన తరువాత వారి సంబంధం గురించి మీడియాలో చాలా కథలు వచ్చాయి.

గంగూలీ – నగ్మ చాలా కాలం నుండి వారి సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడనప్పటికీ వారి పేర్లు చాలా విధాలుగా హెడ్ లైన్స్ లో చర్చించటం ప్రారంభమైంది. ఇది గంగూలీ వైవాహిక జీవితాన్ని అతని వృత్తిని తీవ్రంగా ప్రభావితం చేయటం ప్రారంభించింది.

డోనా వారి వ్యవహారం గురించి తెలుసుకున్నాక గంగూలీ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. అయినప్పటికీ డోనా బాధ్యతలు స్వీకరించి ఈ వార్తను పుకారుగా మార్చారు. అనంతరం గంగూలీ స్మార్ట్ గా నగ్మా నుంచి విడిపోయారు. మనం ఒక వ్యక్తి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని అనుకున్నా కష్టాలను తెచ్చేవాళ్లుంటారు. అప్పుడు ముందుకు సాగడం మంచి ప్రయోజనాల వైపు ఆలోచించాలి అని నగ్మ అన్నారు. ఇక గంగూలీతో ఈగో సమస్యలు తలెత్తాయని అందువల్లనే చివరిగా విడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ లవ్ ఫెయిల్యూర్ అనంతరం నగ్మ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. ఆ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. నగ్మా టాలీవుడ్ లో అగ్ర నాయికగా ఏలారు. తమిళం-హిందీ సహా అన్ని పరిశ్రమల్లోనూ నాయికగా ఓ వెలుగు వెలిగారు.