Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆయనను కొంగున కట్టేసుకుని అబ్రకదబ్ర నేర్పిస్తున్న శ్రీయ

ఆయనను కొంగున కట్టేసుకుని అబ్రకదబ్ర నేర్పిస్తున్న శ్రీయ


ఆయన్ని కొంగున కట్టేసుకోవడం అంటే ఎలానో శ్రీయనే అడగాలి. ఆలుమగల దాంపత్యంలో సరసం అంటే ఏమిటో కూడా శ్రీయనే అడిగి నేర్చుకోవాలి. చాలా జంటలు కీచులాటలతో కొట్లాడే నైజం మానుకుని శ్రీయను ఫ్యామిలీ డాక్టర్ గా ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు.

ఇంత కన్ఫామ్ గా ఖరాకండిగా ఎందుకు చెప్పాల్సి వస్తోందో ఇదిగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. గత కొంతకాలంగా శ్రీయ తన హబ్బీ ఆండ్రూ కోశ్చీవ్ తో లైఫ్ సెలబ్రేషన్ ని ఓ రేంజులోనే ఆస్వాధిస్తోంది. దేశ విదేశాల్లో విహారయాత్రల్ని ముగించుకుని ఇప్పుడు ముంబైలో భర్తతో పాటు సెటిలైంది. హిందీ పరిశ్రమలో తన కెరీర్ బండిని పరుగులు పెట్టించాలన్నది ప్లాన్. అడపాదడపా సౌత్ లో నటిస్తూనే బాలీవుడ్ పై పూర్తిగా దృష్టి పెట్టాలని శ్రీయ భావిస్తోందట.

ఇకపోతే తాజా వీడియోలో అలా క్రెడిట్ కార్డ్ లన్నిటినీ ముక్కలుగా చేసేందుకు అబ్రకదబ్ర మంత్రం వేసిందిలా. తన భర్తకు శ్రీయ అబ్రకదబ్ర మంత్రం నేర్పిస్తున్న వీడియో వైరల్ గా మారింది. అన్నట్టు స్పానిష్ ఆటగాడిని ఆట నుంచి మరల్చి ఇలా కొంగున కట్టేసుకునేందుకు కూడా అబ్రకదబ్రనే పని చేసిందేంటబ్బా! అంటూ ఆరాలు తీస్తున్నారు నేటి తరం కీచులాటల కపుల్స్.