నాట్యమయూరి.. కూచిపూడి క్వీన్ శోభా నాయుడు ఇక లేరు

0

నాట్యమయూరి.. కూచిపూడి క్వీన్ డా. కట్టా శోభా నాయుడు ఇక లేరు. మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ ఆమె బుధవారం మిడ్ నైట్ లో కన్నుమూశారు. రాత్రి 1.44 నిముషాలకు కనుమూశారు. కూచిపూడి సహా పలు నృత్య రూపకాల శిక్షణలో సుదీర్ఘ అనుభవం ఉన్న శోభానాయుడు శిష్యుల్లో ఎందరో టాలీవుడ్ లో ప్రదర్శనలు ఇచ్చారు. నాట్యం అంటే ఆమె సంస్థానం నుంచి రావాల్సిందే. అంత గొప్ప ఘనుతికెక్కారు. డ్యాన్సింగ్ రంగంలో సృజనాత్మక ప్రక్రియల్లో ఆరితేరిన కళాకారిణి శోభానాయుడు.

దేశ విదేశాల్లో రెండు వేల మంది విద్యార్థులను కూచిపూడి నాట్య తారలుగా తీర్చి దిద్దిన ఘనత శోభా నాయుడుదే. 100 కు పైగా సోలో కొరియోగ్రఫీల సృష్టికర్త. పాతిక కూచిపూడి నృత్య రూపకాల సృజనశీలి. పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ పురస్కారం … నృత్య చూడామణి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ పురస్కారం తో పాటు వందలాది పురస్కారాలు ఆమెను వరించాయి.

ఏ పాత్రలోనైనా ఒదిగి ఆ పాత్రకు వన్నె తెచ్చే ప్రత్యేకత…. వేదిక పై దునుమాడే శక్తి వున్న ఏకైక శాస్త్రీయ సాంప్రదాయ నర్తకీమణి శోభానాయుడు. హైదరాబాద్ దోమలగూడా లో ఎన్నో ఏళ్లుగా కూచిపూడి ఆర్ట్ అకాడమీ స్థాపించి సేవలు అందిస్తున్న మహనీయురాలు శోభానాయుడు ను కరోనా బలి తీసుకోవడం విచారకరం దురదృష్టకరం. ఆమె భర్త శ్రీ అర్జునరావు రిటైర్డ్ ఐఏఎస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో చీఫ్ సెక్రటరీ గా పని చేశారు. కూచిపూడి మహా దిగ్గజం దివంగత వెంపటి చిన సత్యం ప్రియ శిష్యురాలు శోభానాయుడు ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి నాట్యానికి ఔనత్యాన్ని తెచ్చారు. కూచిపూడి నాట్యం కోసమే జన్మించిన కారణ జన్మురాలు. ఇంకా ఎన్నో నాట్య ప్రయోగాలు చేయాలనీ చివరి శ్వాస వరకు తపిస్తూనే వున్నారు. ఇంత అకస్మాత్తుగా ఆమె వెళ్లిపోవడం ద్రిగ్భాంతి ని కలిగిస్తోందని నృత్య ప్రపంచం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల నాట్యం పేరుతో ఓ లఘు చిత్రానికి శోభానాయుడు ప్రచారం చేయడం ఆసక్తికరం. ఒక అద్భుతమైన నాట్య రారాణిని కూచిపూడి నాట్య రంగం సినీకళారంగం కోల్పోయింది!