వైరల్ అవుతున్న ‘రానా-మిహీక’ల 3డి స్ట్రక్చర్ పిక్!!

టాలీవుడ్ హీరో రానా అతని భార్య మిహీక బజాజ్ ల ‘కపుల్ కాస్ట్’ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే వీరి ఫోటోలు కొత్తగా పెళ్ళైన జంటలకు ఛాలెంజ్ చేస్తున్నాయి. ఈ మధ్యే రానా మిహీకలు తమ హ్యాండ్ ఇంప్రెషన్స్(అరచేతి ముద్రలను) గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ కోసం హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ కు ఇచ్చారట. అయితే గతేడాది ఆగష్టు నెలలో ఒకటైన ఈ జంట బాలీవుడ్ స్టార్ కపుల్ రన్వీర్ సింగ్ దీపిక పదుకొనేలను అనుసరించినట్లు తెలుస్తుంది. ఇక హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన రానా మిహీకల గురించి సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసింది. అందులో రానా మిహీకల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ ఫోటో పోస్ట్ చేసింది. అంతేగాక ఫోటోతో పాటు.. ‘మేం హ్యాండ్ ఇంప్రెషన్స్ కోసం రానా మిహీకలను కలిసినప్పుడు వారిద్దరిని చూసి వీరి పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందని అలాగే పర్ఫెక్ట్ కపుల్ అనిపించింది.

అలాగే మేం చేతి ముద్రలను తీసుకునే సమయంలో ఖచ్చితంగా మాస్కులు ధరించాం. కానీ మేం కళ్లతో వారి ఆనందాన్ని చూసాం’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్టిస్ట్ భావన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే రానా మిహీక దీపిక రన్వీర్ లతో పాటు ఆర్టిస్ట్ భావన ఎన్నో జంటలకు ఇలా గోల్డెన్ హ్యాండ్ ఇంప్రెషన్ 3డి స్ట్రక్చర్ తయారు చేసిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం రానా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే రానా నటించిన పాన్ ఇండియా మూవీ ‘అరణ్య’ విడుదల గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. ఎందుకంటే గతేడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన అరణ్య లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తీరా ఈ ఏడాది మార్చ్ 26న థియేటర్లలో విడుదల కాబోతుంది. తెలుగు తమిళ హిందీ బాషలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇదేగాక రానా ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిందని సమాచారం.

Related Images:

మత్తుకళ్ల సుందరి మాటే లేదాయే!

అందమైన ఆ కళ్లు కవ్విస్తాయి .. కైపెక్కిస్తాయి. ఊరిస్తాయి .. ఉత్సాహపరుస్తాయి .. ఊహాలోకంలో ఊరేగిస్తాయి. ఆ కళ్ల వాకిలిలో నిలవాలనీ .. ఆ తలపుల వానలో తడవాలని కోరుకోని కుర్రాళ్లు ఉండరు. విచ్చుకున్నట్టుగా కనిపించే పెదాలతో .. గుచ్చుకున్నట్టుగా అనిపించే చూపులతో ఆకట్టుకునే ఆ అందం పేరే నందిత శ్వేత. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో దెయ్యం పాత్రలో ఆమె అదరగొట్టేసింది. ఆమెను చూసినవాళ్లు దెయ్యాలు కూడా ఇంత అందంగా ఉంటాయా అనుకున్నారు .. ఆశ్చర్యపోయారు.

తొలి సినిమాలో పోషించిన పాత్ర ప్రభావం కారణంగా అదే తరహా పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అదే సమయంలో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను కూడా చేసింది. నందిత శ్వేతలో ఆమె కళ్లే ప్రధానమైన ఆకర్షణ. మత్తుమందును నింపుకున్న పాత్రల్లా ఆమె కళ్లు కనిపిస్తాయి. అందువల్లనే ఆమె నయన ప్రధానమైన పాత్రలు చేయవలసి వచ్చింది. ఆ తరువాత ఆమెకి పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోవడం .. చేసిన చిన్న సినిమాలు పేలిపోవడంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ప్రేక్షకులు ఆమెను మరిచిపోయే పరిస్థితికి వచ్చేశారు.

నందిత శ్వేత చేతిలో ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు .. ఒక తెలుగు సినిమా ఉన్నాయి. తెలుగులో సుమంత్ కథానాయకుడిగా రూపొందిన ‘కపటధారి’ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. ఇదే తమిళ సినిమాలో శిబి సత్యరాజ్ జోడీగా కూడా ఆమెనే నటించింది. ఈ రెండు సినిమాలకి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నిజానికి నందిత శ్వేతలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. కనీసం రెండవ కథానాయిక పాత్రలకైనా ఆమెను తీసుకోవచ్చు. లేదంటే విలనీ రోల్స్ కి కూడా ఆమె బాగానే సెట్ అవుతుంది. కానీ తెలుగుకి సంబంధించి కొత్త ప్రాజెక్టులలో ఎక్కడా ఆమె మాటే వినిపించడం లేదు. ఇక ఈ అమ్మాయి కూడా కోలీవుడ్ పైనే పూర్తి దృష్టి పెడుతుందేమో!

Related Images:

‘సూపర్ ఓవర్’ ట్రైలర్ టాక్

ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ సినిమాలు – వెబ్ సిరీస్ లతో పాటు స్పెషల్ షో లను కూడా స్ట్రీమింగ్ కి పెడుతూ వీక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ”సూపర్ ఓవర్” అనే చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేశారు. జనవరి 22న ఆహా యాప్ లో విడుదల కానున్న ఈ సినిమా స్నీక్ పీక్ ను ఇటీవలే యువ హీరో శర్వానంద్ రిలీజ్ చేసాడు. తాజాగా ‘సూపర్ ఓవర్’ మూవీ ట్రైలర్ ని యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియా మధ్యమాల ద్వారా విడుదల చేసి యూనిట్ ని అభినందించారు.

‘సూపర్ ఓవర్’ ట్రైలర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. బెట్టింగ్ లకు అలవాటు పడి పోలీస్ స్టేషన్ కు సమీపంలో దొంగతనం చేసిన ముగ్గురు వ్యక్తులు.. వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించే మరో ఇద్దరు వ్యక్తుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. ఇందులో నవీన్ చంద్ర – చాందిని చౌదరి – అజయ్ – రాకేందు మౌళి – హర్ష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సన్నీ ఎమ్.ఆర్ మ్యూజిక్ అందించగా.. దివాకర్ మని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. డెబ్యూ డైరెక్టర్ ప్రవీణ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ సుధీర్ వర్మ ‘సూపర్ ఓవర్’ చిత్రాన్ని నిర్మించారు.

Related Images:

మెగాహీరోకు న్యూ ఫోటోతో ట్రీట్ ఇచ్చిన ఎఫ్3 టీమ్..!!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2. వెంకటేష్ సరసన తమన్నా వరుణ్ సరసన మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ 2019 సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకేక్కిస్తున్నాడు అనిల్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇటీవలే ఎఫ్3 సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. ఆల్రెడీ ఫస్ట్ డే నుండే వెంకటేష్ షూట్ లో పాల్గొన్నాడు. హైదరాబాదులో వేసిన ప్రత్యేక ఇంటి సెట్ లో ఎఫ్3 షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో వరుణ్ తేజ్ కరోనా బారినపడి కోలుకున్నాడు. ఇటీవలే వరుణ్ కూడా షూటింగులో భాగమాయ్యడు.

అయితే వరుణ్ సెట్ లో పాల్గొన్న సందర్బంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా తనతో దిగిన పిక్ షేర్ చేసి ట్రీట్ ఇచ్చాడు. అలాగే ‘సెట్ లోకి స్వాగతం.. ఇప్పుడు అసలు ఫన్ మొదలైంది’ అంటూ ట్వీట్ చేసాడు. అలాగే ఈరోజు వరుణ్ పుట్టినరోజు సందర్బంగా ఎఫ్3 టీమ్ సోషల్ మీడియా వేదికగా వరుణ్ కొత్త పిక్ షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ కొత్త లుక్ ఆకట్టుకుంటుంది. ఫోటో చూస్తే వరుణ్ చాలా హుషారుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే షూటింగ్ కూడా చకచకా పూర్తి చేస్తున్నారట. ఇక వరుణ్ ఎఫ్3 సినిమాతో పాటు గని సినిమా కూడా చేస్తున్నాడు. ఈరోజే గని మూవీ నుండి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. బాక్సర్ గా వరుణ్ లుక్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుందట. ప్రస్తుతం వరుణ్ సెలెబ్రేషన్స్ మోడ్ లో ఉన్నట్లు సమాచారం.

Related Images:

రవితేజ హీరోయిన్ లిప్ లాక్!

రవితేజ ఇప్పుడు ఫుల్ స్పీడుమీదున్నాడు. ‘క్రాక్’ ఇచ్చిన కిక్ తో.. సక్సెస్ ట్రాక్ ఎక్కేసిన మాస్ మహరాజ్.. ‘ఐయామ్ బ్యాక్’ అంటున్నాడు. క్రాక్ జోరు ఎలా కొనసాగుతోందంటే.. సంక్రాంతి సీజన్ పూర్తయిన తర్వాత కూడా కలెక్షన్స్ దుమ్ములేపుతున్నాయి. ఈ దూకుడు ఇలా కొనసాగుతుండగానే.. తన నెక్స్ట్ మూవీ ‘ఖిలాడి’ని లైన్లో పెట్టాడు రవితేజ.

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ లేటెస్ట్ గా ప్రారంభమైంది. మీనాక్షి చౌదరి డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి ఓ హాట్ న్యూస్ ఇప్పుడు చెక్కర్లు కొడుతోంది.

హీరోయిన్లతో లిప్ లాక్ విషయంలో రవితేజ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అలాంటి సీన్లకు ససేమిరా అంటాడు. లిప్ లాక్ విషయంలో జూనియర్ హీరోలకు పర్మిషన్ ఇస్తున్న ఆడియన్స్.. సీనియర్ హీరోలను అలాంటి సీన్లలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మన్మథుడు-2లో నాగార్జున లిప్ లాక్ పై ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రవితేజ కూడా ముద్దు సీన్లకు నో చెప్తుంటాడు.

అయితే.. తన ‘ఖిలాడి’కోసం ఆ రూల్ ను పక్కన పెట్టాడ మాస్ రాజా! ఈ సినిమాలో ఓ లిప్ లాక్ సన్నివేశం ఉందట. తొలుత ఈ సీన్ చేయడానికి రవితేజ నిరాకరించాడట. కానీ.. ఆ సీన్ అవసరాన్ని వివరించిన దర్శకుడు.. ఫైనల్ గా రవితేజను ఒప్పించాడట!

లిప్ లాక్ ఎందుకు కంపల్సరీయో దర్శకుడు రమేష్ వర్మ చెప్పడంతో చివరకు ఓకే అన్నాడట. ఈ సీన్ ను రవితేజ-మీనాక్షిపై ఇటీవలే వైజాగ్లో షూట్ చేశారట. ఈ వేసవి బరిలో నిలవబోతున్న ఖిలాడీ మూవీలో రవితేజ డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. కొనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related Images:

‘ఆర్.ఆర్.ఆర్’ క్లైమాక్స్ కోసం చేతులు కలిపిన రామరాజు – భీమ్..!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా.. తారక్ ‘కొమరం భీమ్’గా నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో అలియా భట్ – ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే న్యూస్ అందించింది.

‘ఆర్.ఆర్.ఆర్’ భారీ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైందని.. భీమ్ – రామరాజు కలిసి వారు సాధించాలనుకున్నది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈమేరకు తారక్ – చరణ్ ఇద్దరు చేతులను కలిపి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసారు. ఇకపోతే ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ స్పెషల్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ – శ్రియా – సముద్రఖని వంటి స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ ను నిర్మిస్తున్నారు.

Related Images:

మరోసారి తల్లి కాబోతున్న కరీనాకపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. బీటౌన్ ముద్దుగా పిలుచుకునే బెబో.. తాను రోండో సారి ప్రెగ్నెంట్ అని గత ఆగస్టులో అనౌన్స్ చేసింది. ఈ ప్రకటనతో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన కరీనా.. అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.

తన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో సందడి చేస్తోంది. గర్భిణిగా ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఓసారి వివరించిదీ బ్యూటీ. నెగెటివిటీని అస్సలే దగ్గరికి రానివ్వొద్దన్న కరీనా.. నిత్యం వ్యాయామం చేయాలని మంచి ఆహారం తీసుకోవాలని చెప్పింది. ఇంకా.. మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం.. పరిసరాల పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని చెప్పింది.

కాగా.. తన లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఆగస్టులో తన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసింది కరోనా. అంటే.. ఇప్పటికి తను గర్భందాల్చి ఎనిమిది నెలలైంది. కరీనాకపూర్ లేటెస్ట్ ఫొటోలు కూడా అదే విషయాన్ని చాటి చెబుతున్నాయి.

కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరిదీ లవ్ మ్యారేజ్. వీరికి ఇప్పటికే తైమూర్ అలీ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. సైఫ్ కరీనా కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారు.

Related Images:

దొరస్వామి రాజుకు జక్కన్న నివాళులు..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి సోమవారం ఉదయం వయోభారం కారణంగా తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. దొరస్వామి మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అభిమానుల సందర్శనార్దం దొరస్వామి పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. దర్శకుడు రాజమౌళి – మురళీ మోహన్ – అశ్వినీదత్ – ఎన్వీ ప్రసాద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 1000కి పైగా చిత్రాలకు పంపిణీదారుడిగా.. ఎన్నో విజవంతమైన చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరస్వామి అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా కొనియాడారు. మహా ప్రస్థానంలో దొరస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా ‘సీతారామయ్య గారి మనమరాలు’ ‘ప్రెసిడెంట్గారి పెళ్లాం’ ‘అన్నమయ్య’ ‘సింహాద్రి’ వంటి చిత్రాలు దొరస్వామిరాజుకు ఎనలేని పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా అక్కినేని నాగార్జున – రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఆయన తీసిన ‘అన్నమయ్య’ సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రెండు జాతీయ పురస్కారాలతో పాటు ఎనిమిది నంది అవార్డులను కూడా ఈ సినిమా గెలుచుకుంది. దొరస్వామి మృతిపై రాజమౌళి – ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘సింహాద్రి: సినిమా మంచి విజయం సాధించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

Related Images:

వ్వించి చంపేస్తున్న చారూ

ఆరంగేట్రమే అగ్ర హీరోల సరసన నటించేస్తూ టాప్ స్లాట్ లో చేరిపోయింది మల్లూ బ్యూటీ మాళవిక మోహనన్. ఛాయాగ్రాహకుడు మోహనన్ కుమార్తెగా కంటే టాప్ మోడల్ కం పెర్ఫామర్ గా మంచి పేరు తెచ్చుకుంటోంది. తొలుత రజనీకాంత్ పేట సినిమా నటించింది. పేట సంక్రాంతి బరిలో రిలీజై తమిళనాట విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తాజాగా మాస్టర్ సంక్రాంతి బరిలో రిలీజైన సంగతి తెలిసినదే. దళపతి విజయ్ సరసన `మాస్టర్` లో చారుగా అద్భుత అభినయంతో ఆకట్టుకుంది. చారుగా కనిపించినప్పటి నుండి మాళవిక మోహనన్ నుంచి బోయ్స్ కళ్ళు తిప్పుకోవడం కష్టంగానే మారింది. మాస్టర్ కి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా.. మాళవిక అందచందాలు కవ్వింత చాలా మందిని ఆకర్షించాయి. నటిగా అద్భుత పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

మాళవిక మోహనన్ టాప్ మోడల్ గానూ అద్భుత ఫాలోయింగ్ తెచ్చుకుంది. రెగ్యులర్ గా ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా మరో హాట్ లుక్ లో మాళవిక ట్రీట్ హీట్ పెంచింది. బ్లాక్ టైట్ టాప్ .. బ్యాగీ డెనిమ్ జీన్స్ లో మాళవిక ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

అందాల మాళవిక `పట్టం పోల్`(2013) అనే మలయాళ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. పెటా.. మాస్టర్ చిత్రాలతో మరింత పాపులారిటీ పెంచుకుంది. ప్రస్తుతం ఈ భామ కార్తీక్ నరేన్ టైటిల్ నిర్ణయించని మూవీలో నటిస్తోంది. దేవరకొండ సరసన హీరో అనే చిత్రంలో అవకాశం దక్కించుకున్నా ఈ మూవీ ప్రస్తుతానికి వాయిదా పడిందని సమాచారం.

Related Images:

కలెక్షన్ రిపోర్ట్: రామ్ ‘రెడ్’ కి తగ్గని క్రేజ్..!

రామ్ పోతినేని ఈసారి ”రెడ్” సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. సంక్రాంతి హాలిడేస్ లో మంచి వసూల్లే రాబట్టింది. మొదటి రోజే దాదాపు 5 కోట్లు రాబట్టి రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇక మిగతా రోజుల్లో కూడా అదే స్పీడు కొనసాగిస్తూ మొత్తంగా నాలుగు రోజుల్లో 22.70 కోట్ల గ్రాస్ రాబట్టిందని.. ఐదో రోజు 1.16 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ఏరియాల వారీగా కలెక్షన్ రిపోర్ట్ ఒకసారి పరిశీలిస్తే నైజాం- 4.90 కోట్లు.. సీడెడ్- 2.45 కోట్లు.. ఆంధ్రా – 5.75 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా నాలుగు రోజులు కలిపి వరల్డ్ వైడ్ గా 22.70 కోట్ల గ్రాస్.. 13.59 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఐదవ రోజు మొత్తం 1.16 కోట్ల షేర్ ని రాబట్టింది. అంటే మొత్తంగా చూసుకుంటే రామ్ ‘రెడ్’ సినిమా ఐదు రోజుల్లో 14.75 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. కాగా ‘రెడ్’ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేసాడు. ఇది తమిళ్ సూపర్ హిట్ ‘తడమ్’ సినిమా స్టోరీ లైన్ తో తెరకెక్కింది. ఇందులో నివేదా పేతురాజ్ – మాళవికా శర్మ – అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related Images:

A అంటే అతనే.. లవర్ పేరు చెప్పిన మోనాల్..!

సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మోనాల్ గజ్జర్. ఈ సినిమాల తర్వాత 2015 చివర్లో సౌత్ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లింది మోనాల్. పలు ఆఫర్లు వచ్చినా ఇక్కడ నటించలేదట. చాలా కాలం తర్వాత ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. అలా వెళ్లిపోవడానికి కారణం తన ప్రియుడే అంటోంది మోనాల్!

బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్నాళ్లూ తన మనసులో ఉన్నది ‘A’ మాత్రమేనని చెప్పింది మోనాల్. దీంతో.. A అంటే అభిజిత్ అని కొందరు.. అఖిల్ అంటూ మరికొందరు అనుకున్నారు. కానీ.. క్లారిటీ ఇవ్వలేదు మోనాల్. పైగా.. A అంటే యాపిల్ అంటూ ఇష్యూనీ దాటేసింది. అయితే.. తాజాగా A అంటే క్లారిటీ ఇచ్చేసింది.

A అంటే ‘ఆర్యన్’ అని చెప్పిందీ గుజరాత్ బ్యూటీ. ఇతనితో దాదాపు ఐదేళ్లకుపైగా లవ్ జర్నీ కంటిన్యూ చేశానని చెప్పింది. సుడిగాడు సినిమా తరువాత వచ్చిన మలయాళం ఆఫర్ తో మోలీవుడ్ లోకి వెళ్లానని అక్కడి హీరోతో పరిచయం ఏర్పడి రిలేషన్ షిప్లో ఉన్నట్టు చెప్పింది మోనాల్. అతనే మలయాళీ హీరో ఆర్యన్.

అతనితో దాదాపు ఐదారేళ్లు డేటింగ్ చేసిన తర్వాత అనివార్యమైన పరిస్థితుల్లో 2016లో బ్రేకప్ అయినట్లు చెప్పింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురై గుజరాత్ వెళ్లిపోయానని మోనాల్ వెల్లడించింది. ఆర్యన్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఇక సౌత్ ఇండస్ట్రీకి రాలేకపోయానని చెప్పారు. అక్కడే గుజరాతీ సినిమాలు చేస్తూ ఉండిపోయినట్ల తెలిపింది మోనాల్.

ఆర్యన్ విషయానికి వస్తే.. అతను మలయాళ హీరో. వీరిద్దరూ కలిసి 2012లో ‘డ్రాకులా’ అనే మలయాళ త్రీడీ సినిమాలో నటించారు. ఇదే సినిమాను తెలుగులో ‘పున్నమిరాత్రి’గా డబ్ చేశారు. ఈ సినిమా 2016లో తెలుగులో విడుదలైంది.

మొత్తానికి.. బిగ్ హౌస్ లో కొనసాగినంత కాలం తన సీక్రెట్ ను ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిన మోనాల్.. ఇప్పుడు రివీల్ చేసింది.

Related Images:

‘గని’ గా బాక్సింగ్ రింగ్ లో దిగుతున్న వరుణ్ తేజ్..!

మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ‘VT10’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి వరుణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. మెగా ప్రిన్స్ బాక్సర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ”గని” అని టైటిల్ ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో బాక్సింగ్ రింగ్ లో దిగిన బాక్సర్ గా వరుణ్ తేజ్ ని చూపించారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

‘గని’ చిత్రంతో కొర్రపాటి కిరణ్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్ – అల్లు బాబీ పిక్చర్స్ పతాకాలపై అల్లు బాబీ – సిద్ధు ముద్ద కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరో పేరు ‘గని’ కావడం వల్ల ఈ చిత్రానికి అదే టైటిల్ గా పెట్టినట్లు తెలుస్తోంది. ‘బాలు’ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు ‘గని’ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు బాబాయ్ పేరునే అబ్బాయ్ సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించడం కోసం స్పెషల్ డైట్ ను పాటిస్తూ ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడమే కాకుండా.. ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు – కన్నడ స్టార్ ఉపేంద్ర – బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించనున్నారు. ‘గని’ చిత్రాన్ని 2021 జూలై లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Related Images:

రాధిక నా తల్లి కాదు.. నన్ను ఇబ్బంది పెట్టింది – వరలక్ష్మీశరత్ కుమార్

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్తో సినీ ఇండస్ట్రీలోకి చాలా మందే ఎంట్రీ ఇస్తుంటారు.. కానీ కొందరే నిలదొక్కుకుంటారు. అలాంటి వారిలో ఒకరు కోలీవుడ్ నటి వరలక్ష్మి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకెళ్తోంది. లేటెస్ట్ గా రవితేజ చిత్రం ‘క్రాక్’లో జయమ్మ పాత్ర పోషించిన వరలక్ష్మి.. ప్రేక్షకులను భయపెట్టింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన ఫ్యామిలీ సీక్రెట్స్ వెల్లడించింది.

తొలి ఎంట్రీ..
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురే వరలక్ష్మి. అయితే.. రాధిక కూతురు కాదు. మొదటి భార్యకు జన్మించింది. నటన మీద ఎంతో ఇష్టంతో చదువు పూర్తికాగానే.. సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పింది. ‘పోడా పొడి’ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమై.. ఆ తర్వాత కన్నడ సినిమాల్లోకి ప్రవేశించి దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ మెప్పిస్తోంది వరలక్ష్మి.

విలక్షణ పాత్రల్లో..
కెరీర్ ఆరంభంలోనే విలక్షణ నటనతో ఎంతో మెప్పించింది వరలక్ష్మీ శరత్ కుమార్. అన్ని భాషల్లోనూ అదే తరహా నటనతో ఆకట్టుకుంటోంది. ప్రధానంగా.. ‘విక్రమ్ వేదా’ ‘విష్మయ’ ‘మానిక్యా’ ‘కసాబా’ వంటి చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది . ఇక ‘పందెం కోడి 2′ ‘సర్కార్’ వంటి చిత్రాల్లో లేడీ విలన్గానూ కనిపించి సత్తాచాటింది.

తెలుగులోనూ..
సందీప్ కిషన్ నటించిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో సరైన గుర్తింపు దక్కలేదు. కాగా.. ఇటీవల రవితేజ చిత్రం ‘క్రాక్’లో ఆమె పోషించిన జయమ్మ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రోల్లో భయపెట్టే నటనతో ప్రశంసలు అందుకుంటోంది.

హీరో విశాల్తో బ్రేకప్..
ఇక తమిళ స్టార్ హీరో విశాల్ తో ప్రేమలోపడింది ఈ బ్యూటీ. చాలా కాలం పాటు వీరిద్దరూ రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత అందరికీ తెలిసేలా లవ్ జర్నీకంటిన్యూ చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ.. ఏమైందో తెలీదు తమ లవ్ మూవీకి ఎండ్ కార్డ్ వేసేశారు.

రాధిక అలాంటిది..
తన సవతి తల్లి రాధిక గురించి భిన్నమైన కామెంట్స్ చేసింది వరలక్ష్మి. ‘ఆమె నా తల్లి కాదు. కానీ.. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నా కెరీర్కు సంబంధించిన ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటుంది. అయితే.. నేను ఆమెకు ఏదైనా రహస్యం చెబితే.. దాన్ని వెంటనే లీక్ చేసేస్తుంది. అలా నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టింది.’ అని తెలిపింది వరలక్ష్మి. అయితే.. అందులో దురుద్దేశం లేదని చెప్పింది. ‘సీక్రెట్లు ఆమె కావాలని చెప్పదు. పొరపాటున జరిగిపోతుంది’ అని వివరించింది వరలక్ష్మి.

Related Images:

‘బంగారు బుల్లోడు’ ట్రైలర్ టాక్

‘అల్లరి’ నరేష్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ”బంగారు బుల్లోడు”. పి.గిరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏ టీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో అల్లరోడి సరసన పూజా జవేరి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయడం కోసం ఇన్నాళ్ళు వేచి చూసిన మేకర్స్.. జనవరి 23న ‘బంగారు బుల్లోడు’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తున్నాడు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలని తమ అవసరాల కోసం వాడుకొని తిరిగి బ్యాంకులో పెట్టే ఉద్యోగుల వల్ల 100 సవర్ల బంగారం దొంగతనానికి గురైతే ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించగా.. ఎమ్.ఆర్ వర్మ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి – పోసాని కృష్ణ మురళి – ప్రవీణ్ – పృథ్వీ రాజ్ – సత్యం రాజేష్ – వెన్నెల కిశోర్ – ప్రభాస్ శ్రీను – జబర్దస్త్ మహేష్ – భద్రం తదితరులు నటించారు.

Related Images:

ఈ సారా ఇచ్చే కిక్కు మామూలుగా లేదుగా

సారా జేన్ డయాస్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. పంజా సినిమాతోనే సారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక అమ్మడికి తెలుగులో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. ఆ సినిమా తర్వాత అవకాశాల కోసం బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఇప్పటివరకు సారా చేసింది తక్కువ సినిమాలే కానీ ఎక్కువగా హిందీలోనే చేసింది. హిందీలో జుబాన్ క్యా కూల్ హై హం ఓ తేరి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సారా. కానీ హిట్స్ ఉన్నా ఈ భామకి అవకాశాలు మాత్రం రాలేదు. అప్పటినుండి అమ్మడు సినిమాలలో కనిపించడం తగ్గించింది. ఇక సోషల్ మీడియాలో సారాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సొంతం చేసుకుంది.

ఎల్లప్పుడూ కవ్వించే ఫోటోషూట్లతో అభిమానులకు వినోదం అందిస్తోంది. మొన్నటి వరకు లాక్ డౌన్ వలన ఇంటికే పరిమితం అయింది. చేతిలో సినిమాలు లేకపోయినా ఈ వయ్యారి ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఇటీవలే అమ్మడు ఓ ఫోటో పోస్ట్ చేసింది. అమ్మడు సోఫాలో ఒళ్ళంతా బారచాపి కూర్చున్నట్లు కనిపిస్తుంది. అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్ కి.. ఆ పోజుకి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. కానీ ఎన్ని ఫోటోలలో ఎన్ని అందాలు ఒలికించినా ఈ బ్యూటీని పట్టించుకునే నాథులే లేరట. నారింజ రంగు పొట్టి పొట్టి డ్రెస్ తో ఫోజులిస్తే.. యవ్వనంలో ఉన్న కుర్రాళ్ళు ఎందుకు ఆగుతారు. అలా లైక్ షేర్ అంటూ ఫోటో వైరల్ చేసేస్తున్నారు. చూడాలి మరి రోజురోజుకి సోషల్ మీడియాలో ఘాటు ఫోటోలు పోస్ట్ చేస్తోంది. ఎవరైనా ఈ ఫిగర్ చూసైనా సినిమా ఛాన్స్ ఇస్తారేమో..!

Related Images:

ఉగాదికి బాలయ్య ట్రీట్ ఇవ్వనున్నాడా..??

నటసింహం నందమూరి బాలకృష్ణ.. గత కొన్ని సినిమాలుగా అభిమానులను వరుస ప్లాప్ లతో నిరాశపరుస్తున్నాడు. బాలయ్య చివరిగా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రూలర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బకొట్టాయి. ప్రస్తుతం బాలయ్యకు హిట్టు తప్పనిసరి అయింది. ప్రస్తుతం బాలయ్య తనకు రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు ఎంతటి విజయాలను సాధించాయో విదితమే. బాలయ్య అభిమానులలో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అంతేగాక బాలయ్య ద్విపాత్రభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది.

బాలయ్య అభిమానులకు డైరెక్టర్ బోయపాటి పై ఎనలేని నమ్మకంతో పాటు ప్రత్యేక అభిమానం కూడా ఉంది. ఎందుకంటే వేరే హీరోలను ఎలా చూపించినా బాలయ్యను మాత్రం ఓ రేంజ్ లో చూపిస్తాడని అంటున్నారు. బోయపాటి కాంబోలో.. బాలయ్య నడక.. మాట.. డైలాగ్స్.. యాక్షన్ అన్నింట్లో హైడోస్ ఉంటుంది. ఇక బిబి3 అని ప్రచారంలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ఉగాది పండుగ సందర్బంగా విడుదల చేయాలనీ బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ దర్శకనిర్మాతలతో కూడా చర్చించాడట. ఎందుకంటే బాలయ్యకు సంప్రదాయం ముహుర్తాల సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు పండుగలకు దేవుళ్ళకు మిస్ అవ్వకుండా పూజలు శుభాకార్యాలు చేస్తుంటారు బాలయ్య. అందుకే రాబోయే తెలుగు పండుగ ఉగాది కాబట్టి ఆ రోజే సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని భావించి.. ఉగాది పండుగ లోపు సినిమా కంప్లీట్ చేయాలనీ టీమ్ ను ఆదేశించాడని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి బాలయ్య బోయపాటిలు ఉగాదికి ట్రీట్ ఇస్తారేమో..!!

Related Images:

ఫెమీనా కవర్ పై దీపిక కిల్లింగ్ లుక్

రణతంబోర్ అడవిలో భర్త రణవీర్ సింగ్ తో కలిసి నూతన సంవత్సర వేడుకల్ని సెలబ్రేట్ చేసిన తరువాత దీపిక పదుకొనే ముంబై నగరానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం తన క్రేజీ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా ఇటీవల తన పోస్ట్ లన్నింటినీ ఇన్ స్టాగ్రామ్ నుండి తొలగించిన దీపిక తన అభిమానులతో తాజా ఫోటోషూట్లను పంచుకుంటున్నారు.

ఎవ్వర్ లేటెస్ట్ ఫెమినా కవర్ పేజీని దీపిక షేర్ చేయగా అది అంతర్జాలంలో వైరల్ గా మారింది. బ్లూ లుక్ లో డిప్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. కవర్ పేజీలో బ్లూ బ్లేజర్ లుక్ ప్రత్యేకం అని అభిమానులు పొగిడేస్తున్నారు.

తన అభిమానులతో చిత్రాన్ని పంచుకుంటూ డిపి ఇన్ స్టాగ్రామ్ లో ఏమని రాసారు అంటే.. “నేను ఒక చిన్నారిగా ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు `ఫెమినా ఇండియా` నా మదర్ చదివిన ఏకైక మ్యాగజైన్. టైంలెస్ & ఐకానిక్! ఈ క్వాలిటీకి ధన్యవాదాలు!“ అని వ్యాఖ్యను జోడించారు.

దీపిక కెరీర్ సంగతి చూస్తే.. ప్రస్తుతం ఆరు చిత్రాలతో ఫుల్ బిజీ. హృతిక్ రోషన్ తో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ ఫైటర్ ను ఇటీవల ప్రకటించిన దీపిక ఆసక్తికరమైన ప్రాజెక్టుల సుదీర్ఘ జాబితాను కలిగి ఉంది. ఇటీవలే సిద్ధాంత్ చతుర్వేది- అనన్య పాండేలతో కలిసి షకున్ బాత్రా తాజా ప్రాజెక్ట్ షూటింగ్ లో దీపిక బిజీగా ఉంది. షారుఖ్ ఖాన్ సరసన పఠాన్.. ప్రభాస్- నాగ్ అశ్విన్ జోడీ పాన్ ఇండియా బహుభాషా చిత్రం.. అలాగే `ది ఇంటర్న్` హిందీ రీమేక్ .. `మహాభారతం` సినిమాలోనూ నటించనుంది.

దీపిక ఈ సంవత్సరం భారీ చిత్రాలతో బిజీగా ఉంటూనే.. బ్రాండ్ ఎండార్స్ మెంట్ లతోనూ అంతే తీరిక లేకుండా ఉండనుంది. అందుకే ప్రస్తుతానికి బెంగళూరులో నివసించే ఆమె తల్లిదండ్రులు .. సోదరితో ఎక్కువ సమయం గడిపేస్తోందట.

Related Images:

మాస్ మహారాజ్ ‘క్రాక్’ 2వ రోజు కలెక్షన్స్

‘డాన్ శీను’ ‘బలుపు’ చిత్రాల తర్వాత మాస్ మహారాజ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘క్రాక్‘. టైటిల్ తోనే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమా మరీ రొటీన్ ఫార్ములాలా ఉన్నా మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉండడం, థియేటర్స్ లో చాలా రోజుల నుంచి సినిమాలేని ఎఫెక్ట్ వలన థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. దీంతో రవితేజ క్రాక్ మొదటి రోజు సూపర్బ్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ప్రీమియర్స్ + మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిన ఈ సినిమా రెండవ రోజు కూడా అదే దూకుడుతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంది.

మొత్తంగా 16. కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేస్తే ఈ సినిమా లాభాల బాట పట్టినట్టు, మొదటి రెండు రోజుల్లో 9 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేయడం, అలాగే సంక్రాంతి సీజన్ ముందు ఉండడంతో పక్కాగా లాభాలు వస్తాయని బయ్యర్స్ అంటున్నారు.

క్రాక్ ప్రీమియర్స్ + మొదటి రోజు మొత్తం షేర్: 6.1 కోట్లు

రవితేజ ‘క్రాక్’ రెండవ రోజు ఏరియా వారీగా కలెక్షన్స్ రిపోర్ట్:

నైజాం – 1 కోటి

సీడెడ్ – 60 లక్షలు

ఉత్తరాంద్ర – 35 లక్షలు

తూర్పు గోదావరి – 33.5 లక్షలు

పశ్చిమ గోదావరి – 18 లక్షలు

గుంటూరు – 24 లక్షలు

కృష్ణ – 20 లక్షలు

నెల్లూరు – 17.5 లక్షలు

మొత్తం – 3.08 కోట్లు

రెండు రోజుల మొత్తం షేర్ : 9.18 కోట్లు

Related Images:

తెరపైకి రవితేజ ‘ఖిలాడి’!

మాస్ మహరాజ్ రవితేజ తన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’తో ఫామ్లోకి వచ్చేశాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి ఫలితాన్నే అందుకుంది. భారీ ఓపెనింగ్స్తో మొదలైన ఈ మూవీ జర్నీ.. బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమా ఫలితంతో.. ఎన్నాళ్లూగానో హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ కెరీర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ ‘క్రాక్’ సక్సెస్ జోరులోనే తన కొత్త చిత్రం ‘ఖిలాడి’ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడట రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వేసవి రేసులో నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సంక్రాంతి కానుగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి వేసవి విడుదలను ఖరారు చేసింది చిత్ర యూనిట్.

ఈ ఫెస్టివల్ సందర్భంగానే ‘ఖిలాడి’ హీరోయిన్లు ఎవరనేది కూడా తేలిపోయింది. మాస్ రాజా సరసన ఇద్దరు హాట్ బ్యూటీస్ను తీసుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. వారిలో ఒకరు మీనాక్షి చౌదరి మరొకరు డింపుల్ హయతి.

వీరిలో నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి రెండేళ్ల కిందట ‘ఫెమీనా మిస్ గ్రాండ్’ పోటీల్లో విజేతగా నిలిచింది. మోడలింగ్ ర్యాంపుపై మెరుపులు మెరిపించిన ఈ సుందరి.. ఇప్పటికే తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే మూవీలో నటిస్తోందీ అమ్మడు. సుశాంత్ హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రం.. ముగింపు దశలో ఉంది. అయితే.. ఈ సినిమా విడుదల కాకముందే ఏకంగా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి.

ఇక మరో భామ డింపుల్ హయతి గురించి చెప్పాలంటే ‘గద్దలకొండ గణేష్’ను లైన్లోకి తీసుకోవాలి. ఆ చిత్రంలో ‘సూపర్ హిట్టూ నీ హైటు’ అంటూ మంచి మాస్ ఐటెం సాంగ్ చేసింది ఈ భామ. అందులో డింపుల్ ఎంత హాట్గా కనిపించిందో అందరికీ తెలిసిందే. తన స్టెప్పులతో యూత్ ను అలరించింది బ్యూటీ. ఓవరాల్ గా.. మాస్ మహరాజ్ సరసన ఇద్దరూ హాట్ భామల్నే తీసుకున్న రమేష్ వర్మ.. ఈ మూవీలో వాళ్ల అందాల్ని ఏ మేరకు ఎలివేట్ చేస్తాడో చూడాలి. ‘క్రాక్’ తో కమర్షియల్ హిట్ సొంతం చేసుకున్న రవితేజ.. రాబోయే మూవీతోనూ మంచి హిట్ సాధిస్తాడని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్.

Related Images:

‘క్రాక్’ హిట్ శ్రుతి హాసన్ కి కలిసొచ్చినట్టే!

తెరపై శ్రుతి హాసన్ ను చూడగానే బ్రహ్మదేవుడు ఈ అమ్మాయిని పాలమీగడతో చేశాడేమోనని అనిపిస్తుంది. అంతటి నాజూకుతనం ఆమె సొంతం. కుదురైన రూపంలోనే అన్నీ ఏర్చి .. కూర్చి .. పేర్చినట్టుగా కనిపిస్తుంది. ఈ సుందరి గ్లామర్ కి గానీ .. నటనకి గాని వంకబెట్టవలసిన పనిలేదు. పైగా ఎక్కడా ఆమె కమల్ కూతురునని చెప్పుకుని అవకాశాలు సంపాదించకపోవడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. తమిళ .. తెలుగు భాషల్లో వరుస ఫ్లాపులు ఉక్కిరిబిక్కిరి చేసినా దురదృష్టంపై ఆమె కలబడింది .. తట్టుకుని నిలబడింది.

వెలుగు ఉన్న చోటునే వెతుక్కోవాలి అన్నట్టుగా ఆమె ఎక్కడైతే ఐరన్ లెగ్ అనిపించుకుందో అక్కడే గోల్డెన్ లెగ్ అనిపించుకునేంతవరకూ వదల్లేదు. అంతటి పట్టుదలతో ఆమె అనుకున్నది సాధించింది. అంతేకాదు భారీ హిట్లు పడినప్పటికీ ఆమె తల ఎగరేసిన దాఖలాలు కనిపించవు .. లైట్ తీసుకుని తన పని తాను చేసుకునేది. అలాంటి శ్రుతి హాసన్ హిందీలోను తన సత్తా చాటడానికి గట్టి ప్రయత్నాలే చేసింది. ఈ క్రమంలోనే ఆమె తెలుగు .. తమిళ భాషల్లో దృష్టి పెట్టలేకపోయింది. అదే సమయంలో లవ్ ట్రాక్ లో పడిపోయి హిందీ సినిమాలకి కూడా దూరమైంది. అలా కెరియర్ పరంగా వెనుకబడిపోయింది.

తీరా నువు కనుతెరిచాక .. తీరం కనబడదే ఇంకా అన్నట్టుగా ఆమె చేతిలో ఒక్క సినిమా లేకుండా పోయింది. తమిళ .. తెలుగు భాషల్లో కొత్త హీరోయిన్ల జోరు పెరిగిపోయింది. దాంతో ఆమె తిరిగి మొదటి మెట్టు దగ్గర నుంచి తన ప్రయత్నాలు ప్రారంభించింది. అలా తెలుగులో ‘క్రాక్’ సినిమాలో ఛాన్స్ సంపాదించింది. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో గతంలో ‘బలుపు’ చేసిన ఆమె ఇప్పుడు ‘క్రాక్’ సినిమా చేసింది. ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకోవడంతో శ్రుతి హాసన్ తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఆమె రీ ఎంట్రీకి ఈ హిట్టు కలిసొచ్చింది. ఇక ఇప్పుడైనా ఆమె కాస్త నిలకడగా ఇక్కడ అవకాశాలని అందుకుంటూ గతంలో తాను వదిలేసి వెళ్లిన ప్లేస్ ను దక్కించుకుంటుందేమో చూడాలి.

Related Images: