రాధే శ్యామ్.. ఆ ఒక్క ఫైట్ తో లేపుతారట!

0

ఇండియన్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సినిమాగా `సాహో` సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలో ప్రభాస్ స్టంట్స్ కి ఒళ్లు గగుర్పొడిచే ట్రీట్ కి మాస్ ఆడియెన్ ఫిదా అయిపోయారు. ఇంత భారీ పాన్ ఇండియా సినిమాలో యాక్షన్ ఈ స్థాయిలో ఉండడం కామనే కానీ ప్రభాస్ ఇతర సినిమాల్లో కూడా యాక్షన్ కి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదన్నది తెలిసినదే. అతడు నటించిన ఛత్రపతి.. బిల్లా.. రెబల్ లాంటి సినిమాల్లో యాక్షన్ హైలైట్ గా నిలిచింది.

ప్రస్తుతం ప్యూర్ లవ్ స్టోరి `రాధే శ్యామ్`లో నటిస్తున్నాడు ప్రభాస్. ఇందులో యాక్షన్ ఉందా లేదా? అన్న సందేహాలు అభిమానులకు ఉన్నాయి. అయితే అలాంటి వారికే ఈ ఆన్సర్ అన్నట్టుగా ఇప్పుడు భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం రూ .2 కోట్ల భారీ బడ్జెట్ తో హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించనున్నారు. దీనికి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ రూ .2 కోట్ల బడ్జెట్ ని దీనికోసం ఖర్చు చేయనున్నారు.

ప్రభాస్ పైనే మొత్తం యాక్షన్ సీన్ ని తెరకెక్కించాల్సి ఉందట. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తుందని కచ్చితంగా ఇది అభిమానులకు మాస్ ట్రీట్ అవుతుందని చెబుతున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో పని చేయడం ఇంత భారీగా ఖర్చు చేయడం భారతీయ సినిమాల్లో కొత్త కాదు. ఇంతకుముందు సాహో-సైరా-వార్ చిత్రాలకు విదేశీ సాంకేతిక నిపుణులు పని చేశారు. ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలోనూ ఆ తరహాలోనే విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్ పని చేస్తున్నారు. ఆ ఒక్క ఫైట్ కనెక్టయితే ప్రభాస్ మాస్ అభిమానులకు సరిగా కనెక్టవుతుంది ఈ మూవీ.