పూజా అన్నీ ఇలాంటి వేషాలేనా?

0

మొన్నటివరకూ నాన్న వండితే తిని పెట్టింది! ఇప్పుడేమో ఈ కలరింగేంటి? ఏమో .. ప్చ్.. తాను వండిపెడితే నాన్నగారు తిన్నారట. నమ్మమంటావా బుట్ట బొమ్మా. నీకు వంట రాదని మాకు తెలుసుగా!!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి షూటింగ్ లేని రోజులను ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో కిచెన్ లో దూరి నానా యాగీ చేస్తోంది పూజా. అందుకు సంబంధించిన రకరకాల ఫోటోల్ని వీడియోల్ని తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం ద్వారా తనలోని పాక నైపుణ్యాలను ప్రదర్శించే ప్రయత్నం చేసింది.

తాజాగా మరోసారి కిచెన్ మిషన్ లో సత్తా చాటిందట. పూజా తన తండ్రి కోసం చెఫ్ గా మారి రుచికరమైన జానీ చింతపండు హైబాల్ ను తయారు చేసిందట. తన అభిమానులతో రెసిపీని కూడా పంచుకుంది. ఈ పానీయంలో ఆల్కహాల్ ఉన్నందున బాధ్యతతో కూడిన ఆస్వాధనకు అలవాటు పడాలని పూజా తన అభిమానులను హెచ్చరించింది.

అల వైకుంఠపురములో సినిమాతో 2020 బెస్ట్ హీరోయిన్ గా రికార్డులకెక్కింది. ప్రభాస్ సరసన రాధే శ్యామ్ లో నటిస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ లాక్ డౌన్ అనంతరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అన్నది సస్పెన్స్ గా మారింది. ఈలోగా తీరిక సమయాన్ని మాత్రం నచ్చినట్టు పిచ్చిగా పాపాతో కలిసి ఎంజాయ్ చేస్తోందిలా. కానీ పూజా నిజంగానే వండుతోందా? లేక ఇలా కలరింగిస్తోందా? అంటూ పంచ్ లు వేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకుముందు నాన్న గారు వండిపెడితే తింటున్న పూజాని చూసిన వారంతా ఇలానే ప్రశ్నిస్తున్నారు.