`బుట్ట బొమ్మ` ఫార్మల్ స్టైల్ కి ఎయిర్ పోర్ట్ షేక్!

0

చిట్టి పొట్టి దుస్తుల్లో పొడుగు కాళ్ల అందాల్ని ప్రదర్శిస్తూ అల్ట్రా మోడ్రన్ లుక్ తో కనిపించింది `అల వైకుంఠపురములో` చిత్రంలో పూజా హెగ్డేని బుట్ట బొమ్మా అంటూ పొగిడేస్తే అవునులే అని అంతా తలలు ఊపారు. నిజానికి బుట్ట బొమ్మ అంటే అందంగా పరికిణీలో కనిపిస్తుందేమో! అని ఊహించుకున్నవాళ్లు కంగారు పడ్డారు కూడా. మోడ్రన్ బుట్ట బొమ్మ ఇంతేలే అని త్రివిక్రమ్ కన్విన్స్ చేసిన తీరు ఆకట్టుకుంది.

అదంతా సరే కానీ బుట్ట బొమ్మ ఇమేజ్ ని కాపాడుకునేందుకు పూజా పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. విమానాశ్రయంలో తారసపడితే తన అందాన్ని పొగిడేవాళ్లు కావాలని అనుకుంటోంది. అందుకేనేమో ఇదిగో ఇలా ఫార్మల్ ఫ్యాంటు మెరూన్ మిరమిరల టాప్ లో దుమ్ము రేపింది.

పైగా కోవిడ్ నియమనిబంధనల ప్రకారం మాస్క్ పెట్టుకుని కనిపించింది. అన్నట్టు పూజాతో పాటే అసిస్టెంట్ కూడా సేమ్ కాంబినేషన్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు మరిక. ఇక పూజా కెరీర్ పరంగా ఇప్పటికిప్పుడు వరుస సినిమాలతో బిజీ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షెడ్యూల్ ఓవైపు పూర్తవుతోంది. మరోవైపు రాధే శ్యామ్ షెడ్యూల్ తోనూ బిజీ కానుంది. వేరొక వైపు అటు హిందీ సినిమాలతోనూ అంతే బిజీగా ఉండనుంది. అందుకే ఇలా ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ పనయ్యాక.. ఇట్నుంచి అటు వెళుతూ బిజీ బిజీగా ఉంది.