డార్లింగ్ ప్రభాస్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పిన బుట్టబొమ్మ..!

0

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ఈ పీరియాడికల్ లవ్ స్టోరీలో విక్రమాదిత్య ప్రేయసి ప్రేరణగా పూజా కనిపించనుంది. కరోనా నేపథ్యంలో ఇటీవలే ప్రారంభమైన ఇటలీ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా పాల్గొంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాల షూట్ లో పాల్గొన్న పూజా.. ఇండియాకి తిరిగొచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డార్లింగ్ ప్రభాస్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పింది.

పూజా హెగ్డే మాట్లాడుతూ.. ”ప్రభాస్ నేను అనుకున్నంత సిగ్గు పడే వ్యక్తి కాదు. అతని బిహేవియర్ ఎదుటివారి బిహేవియర్ మీద.. వారు మాట్లాడే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి అతను ఎవరికైనా క్లోజ్ అయితే మాత్రం వారితో చాలా జోవియల్ గా ఉంటాడు. సెట్స్ లో మేమిద్దరం చాలా ఫ్రీగా మూవ్ అయ్యే వాళ్ళం” అని చెప్పుకొచ్చింది. కాగా పూజాహెగ్డే ‘రాధే శ్యామ్’ తో పాటు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు – వాసు వర్మ నిర్మిస్తున్నారు.