Templates by BIGtheme NET
Home >> Cinema News >> పంది మాంసం మా సాంప్రదాయ వంటకం : రష్మిక

పంది మాంసం మా సాంప్రదాయ వంటకం : రష్మిక


ఉపాసన ‘యువర్ లైఫ్’ కు రష్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా రష్మిక తనకు వచ్చిన వంటకాలను ఉపాసనతో కలిసి వండుతూ ప్రేక్షకులకు వంట విధానంను కూడా తెలియజేస్తూ కార్యక్రమంను నిర్వహిస్తుంది. తాజా ఎపిసోడ్ లో చికెన్ పుట్టు కర్రీని రష్మిక చేసింది. ఆ వంటకంను రష్మిక అద్బుతంగా చేసిందని వందకు వంద మార్కులను ఈ సందర్బంగా ఉపాసన ఇచ్చింది. వంట వచ్చిన అమ్మాయి భార్యగా కావాలనుకునే వారికి నిజంగా రష్మికను వివాహం చేసుకుంటే చాలా అదృష్టం అంటూ ఉపాసన ప్రశంసించింది.

ఇద్దరి మద్య చాలా వంటల గురించి పద్దతుల గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్బంగా రష్మిక తన సామాజిక వర్గం కోర్గి గురించి చెప్పింది. కర్ణాటక రాష్ట్రం కొడుకు జిల్లాలకు చెందిన రష్మిక తనది కోర్గి తెగ అని చెప్పేందుకు మొహమాట పడలేదు. పైగ ఆమె సామాజిక వర్గంకు చెందిన వారు పంది మాంసంను సాంప్రదాయ వంటకంగా తింటారని కూడా చెప్పింది. ప్రతి ప్రత్యేకమైన సందర్బాల్లో పంది మాంసంను అధికంగా తింటామని ఈ సందర్బంగా రష్మిక చెప్పుకొచ్చింది. పంది మాంసంను నేరుగా కాల్చి తింటూ వైన్ తాగడం మా సాంప్రదాయంలో భాగం అని కూడా రష్మిక చెప్పింది.

తమ సామాజిక వర్గంకు చెందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు వైన్ తయారు చేసుకుని ఇంట్లో తాగేందుకు ఇష్టపడుతాం అంది. ప్రతి కొర్గి ఇంట్లో పడుకునే ముందు రెండు పెగ్ ల వైన్ ను తాగడం వల్ల మంచి నిద్ర వస్తుందని అంటారు. అందుకే తాము దీనిని ఎక్కువగా తీసుకుంటామని ఆరోగ్యం కూడా ఉంటుందని చెప్పుకొచ్చింది. కొర్గి ప్రజలు ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉంటారు అంటుంది.