Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఘాటు ఫోజులతో చెలరేగుతున్న ప్రగ్య.. కారణమిదే!

ఘాటు ఫోజులతో చెలరేగుతున్న ప్రగ్య.. కారణమిదే!


దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. క్రేజు ఉండగానే నాలుగు కాసులు ఆర్జించాలి. ప్రస్తుతం తనకు సోషల్ మీడియాల్లో పెరుగుతున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రగ్య ఘాటైన ఫోజులతో చెలరేగుతోంది. తద్వారా ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇది తన టార్గెట్ -ఎక్స్ కి ఎంతో హెల్ప్ అవుతోంది మరి. ఇటీవల వరుసగా ప్రఖ్యాత బ్రాండ్లను తన ఖాతాలో వేసుకుంటూ ప్రగ్య బాగానే ఆర్జిస్తోంది. ఇక సినిమాల పరంగా అవకాశాలేవీ లేకపోయినా ఆదాయ ఆర్జనలో ఫర్వాలేదనిపించేస్తోందట.

ఇంతకుముందు పలు కార్పొరెట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న ఫోటోల్ని షేర్ చేసిన ప్రగ్య మరోసారి లేటెస్ట్ ఫోటోషూట్ లో చెలరేగింది. బ్లాక్ డిజైనర్ క్రిస్టలైన్ డ్రెస్ లో ప్రగ్య టూమచ్ హాట్ గా కనిపిస్తోంది. ఆల్మోస్ట్ అర్థ నగ్నంగా అందాలను ఎలివేట్ చేస్తున్న ఆ డిజైన్ సంథింగ్ హాట్ అనే చెప్పాలి. అన్నట్టు ప్రగ్యకు పవన్ సరసన హరీష్ శంకర్ సినిమాలో ఆఫర్ అంటూ ప్రచారమైంది. దానిపై సరైన అప్ డేట్ రివీల్ కావాల్సి ఉంది ఇంకా.