తండ్రి లేని అమ్మాయికి ప్రకాష్ రాజ్ పెద్ద మనసుతో సాయం

0

చదువుపై ఆసక్తి ఉన్నా కూడా కొందరు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా అర్థాంతరంగా చదువును మానేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ మద్య కాలంలో అలాంటి వారు సోషల్ మీడియాలో ప్రముఖుల సాయంను కోరడం కొంత మంది మంచి మనసుతో సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. పేద విద్యార్థుల కోసం సాయంగా నిలిచేందుకు పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయంను చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పెద్దేవంకు చెందిన సిరిచందన అనే అమ్మాయి తండ్రి లేకపోవడంతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదవలేక పోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెలియజేసింది.

కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఆమె ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ సీటును సంపాదించింది. తండ్రి లేని కారణంగా ఆమె అక్కడకు వెళ్లి మాస్టర్స్ చేయలేకపోతున్నట్లుగా తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆమెను స్వయంగా కలిసి సాయం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నాను అని నీవు వెళ్లి మాస్టర్స్ చదువుకో అంటూ హామీ ఇచ్చాడు. ఆమె మాస్టర్స్ కు కావాల్సిన పూర్తి మొత్తంను ఆయన పెట్టనున్నాడు. సినిమాల్లో విలన్ గా కనిపించినా ప్రకాష్ రాజ్ మంచి మనసును కలిగి ఉన్న వ్యక్తి అంటూ గతంలోనే పలు సార్లు నిరూపితం అయ్యింది. మరోసారి ఆ విషయంలో ప్రకాష్ రాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు.