`పుష్ప` విలన్ ఎవరు?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న `పుష్ప`లో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తారని ఇటీవల కథనాలొచ్చాయి. అయితే తరువాత కాల్షీట్ల సమస్యల కారణంగా విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ఆఫర్ మాధవన్ చేతికి చిక్కిందని వార్తలు వచ్చాయి. అయితే మ్యాడీ ఇందులో నటిస్తున్నారా? అన్నదానికి ఆయనే క్లారిటీ ఇచ్చేశారు. మాధవన్ తాజా ట్వీట్ అన్ని పుకార్లకు చెక్ పెట్టేసింది. `అబ్బాయిలూ.. ఇవేవీ నిజం కాదు` అని సింపుల్ గా ఆ వార్తలను ఖండించారు మ్యాడీ.

పుష్ప చిత్రం బన్ని శరీరభాషకు తగ్గ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుంది. అల్లు అర్జున్ ఇందులో చిత్తూరు మాండలికంలో మాట్లాడతారు. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే మొత్తం డైలాగ్ లను బన్నీకి అందజేశాడని.. యాస భాషలో పరిపూర్ణతను బన్ని సాధించాడని చిత్రబృందం వెల్లడిస్తోంది. ఈ చిత్రంలో బన్ని ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ప్రకాష్ రాజ్ – జగపతి బాబులు కీలక పాత్రలు పోషించనున్నారు. హరీష్ ఉథమాన్ … వెన్నెల కిషోర్ .. అనీష్ కురువిల్లా ఇందులో ఇతర తారాగణం. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నారని దర్శకనిర్మాతలు అతడితో చర్చలు జరుపుతున్నారని కూడా కథనాలొస్తున్నాయి.

ఎర్ర దుంగల అక్రమ రవాణా ఆధారంగా రూపొందిస్తున్న విలేజ్ డ్రామా ఇది. తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ – హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుందని సమాచారం. ఇక ఈ మూవీలో మ్యాడీ చేరకపోతే.. ఆ ప్లేస్ రీప్లేస్ చేసేదెవరు? అన్నది ఇంకా సస్పెన్స్.