‘దేవదాసు’ దర్శకుడు తండ్రయ్యాడు

0

భలే మంచి రోజు సినిమాలో దర్శకుడిగా మొదటి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆధిత్య ఆ తర్వాత మరో విభిన్నమైన సినిమా శమంతకమణి ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమాకు కూడా శ్రీరామ్ ప్రశంసలు పొందాడు. ఈయన రెండేళ్ల క్రితం నాగార్జున.. నానిలతో ‘దేవదాసు’ అంటూ మల్టీస్టారర్ ను తెరకెక్కించాడు. ఆ సినిమా నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ దర్శకుడు ప్రస్తుతం గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సమయంలో ఒక స్టార్ అతడి ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చాడు. శ్రీరామ్ ఆధిత్య భార్య ఇటీవలే బాబుకు జన్మనిచ్చింది. తన కొడుకును సోషల్ మీడియా ద్వారా జనాలకు పరిచయం చేయడంతో పాటు చూపించాడు. తన క్యూట్ సన్ ను చూపిస్తూ దర్శకుడు శ్రీరామ్ ఆధిత్య మురిసి పోవడం చూడవచ్చు. సోషల్ మీడియాలో శ్రీరామ్ ఆధిత్యకు సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.