అంత పెద్ద విషయం నాగ్ ఎలా దాచగలిగారు

0

ఈమద్య కాలంలో స్టార్స్ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా చాలా పెద్ద సమస్య అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఒక నటుడు చిన్న కాలు నొప్పితో హాస్పిటల్ కు వెళ్లగా ఆయనకు ఏకంగా కరోనా అంటూ ప్రచారం చేశారు. అలా ఎంతో మంది ఆరోగ్య విషయమై మీడియాలో ప్రచారం జరిగింది. అలాంటిది నాగార్జున కొన్నాళ్ల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినా కూడా ఆయన ఆరోగ్యం విషయంలో మీడియాలో చిన్న వార్త కూడా రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ ఆరు సంవత్సరాల క్రితం తీవ్రమైన నడుము నొప్పి మరియు మోకాళ్ల నొప్పులతో బాధపడ్డాను. ఆ సమయంలో నా మిత్రుల సాయంతో సమస్య నుండి బయట పడ్డాను. స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి వారు చెప్పడంతో నేను దాన్ని ఫాలో అయ్యాను. దాంతో కొన్ని రోజుల్లోనే తాను సమస్యల నుండి పూర్తిగా బయట పడ్డాను. దాని వల్ల మళ్లీ నేను మునుపటి ఉత్సాహంతో ఉన్నాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.

సుదీర్ఘ కాలం పాటు డాన్స్ లు మరియు ఫైట్స్ చేయడం వల్ల తనకు అనారోగ్య సమస్యలు వచ్చాయంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. నాగార్జున అంతటి సమస్యలు మీడియాలో ప్రచారం కాకుండా చూసుకున్నాడు. ఆ విషయాన్ని నాగ్ ఎలా దాచి ఉంటారా అంటూ అంతా కూడా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.