వితిక అంతా రివర్స్ లో వెళ్తుందిగా..!

0

అనసూయ.. రేష్మి గౌతమ్.. శ్రీముఖి ఇంకా కొందరు యాంకర్స్ గా గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత హీరోయిన్స్ గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మేల్ యాంకర్స్ రవి మరియు ప్రదీప్ లు కూడా బుల్లి తెరపై మెప్పించి వెండి తెరపై అలరించారు. ఇంకా పలువురు కూడా బుల్లి తెర నుండి వెండి తెరపైకి వెళ్లారు. వారిలో కొందరు సక్సెస్ అయ్యారు మరి కొందరు నిరాశ పర్చారు. ఆ విషయం పక్కన పెడితే వెండి తెర నుండి బుల్లి తెరకు వచ్చిన వారు చాలా అరుదుగా ఉంటారు. హీరోయన్ గా నటించిన వితిక షేరు బిగ్ బాస్ ద్వారా బుల్లి తెరపైకి వచ్చిన విషయం తెల్సిందే. ఆమె బుల్లి తెర జర్నీ కేవలం బిగ్ బాస్ తో ఎండ్ చేయకుండా కంటిన్యూ చేయాలనుకుంటుంది.

హీరోయిన్ గా నటించినప్పటి కంటే కూడా బిగ్ బాస్ ద్వారానే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెట్టడంతో పాటు సందర్బానుసారంగా బుల్లి తెరపై కనిపిస్తూ వచ్చింది. ఇటీవల యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి మరింతగా ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. త్వరలోనే ఈమె ఒక బుల్లి తెర రియాల్టీ షోకు యాంకర్ గా వ్యవహరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. కెరీర్ లో రివర్స్ జర్నీ చేస్తున్న వితిక షేరు ఇలా అయిన సక్సెస్ అవుతుందో చూడాలి. హీరోయిన్ గా నిరాశే పర్చిన వితిక బుల్లి తెరపై యాంకర్ గా సక్సెస్ అయితే ఖచ్చితంగా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.