కుమ్మి పడేసిన ఖల్లాస్ గాళ్

0

`ఏక్ థా దిల్ ఏక్తా ధడ్కన్` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇషా కొప్పికర్. బాలీవుడ్ లో తొలి సినిమాతోనే అటెన్షన్ ని క్రియేట్ చేసింది. ఆ తరువాత వెంటనే `చంద్రలేఖ`తో టాలీవుడ్ లో ప్రవేశించింది. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కృష్ణవంశీ తెరకెక్కించారు. ఈ మూవీలో కీ రోల్ పోషించింది ఇషా. ఇందులో రమ్యకృష్ణ కూడా ప్రధాన పాత్రలో నటించింది.

ఆ తరువాత వెంకటేష్ తో ` ప్రేమతో రా` లో నటించినా ఫలితం లేకుండా పోయింది. కొన్నేళ్ల విరామం తరువాత మరోసారి `కేశవ`తో పలకరించింది. కానీ టాలీవుడ్ కొప్పికర్ తో మిలాఖత్ అవ్వడానికి సిద్ధపడలేకపోయింది. అవకాశాల్ని అందించలేకపోయింది. దీంతో ఇషా తమిళ ఇండస్ట్రీ వైపు తొంగిచూస్తోంది. అక్కడ శివకార్తికేయన్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ `అయలాన్`లో ప్రస్తుతం నటిస్తోంది.

ఇదిలా వుంటే లేటు వయసు ఘాటు పరువాలతో కొప్పికర్ దుమారం రేపుతున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. 44 దాటి ఓ కిడ్ కి మామ్ అయినా ఇషాలో ఫైర్ ఏమాత్రం తగ్గలేదు. పిక్కల పైకి కనిపించేలా పొట్టినిక్కరు వేసుకుని హాట్ హాట్ పోజులిచ్చింది ఈ మ్యాడమ్ గారు. నియాన్ కాంతుల్లో మైమెరిపించే మేనిఛాయతో ఫోజులిస్తూ నెటిజన్స్ ని హీటెక్కిస్తోంది. ఈ హాట్ ఆంటీ పోజులకు కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు మరి. `ఖల్లాస్` అంటూ బాలీవుడ్ లో ఐటం గీతంతో రెచ్చిపోయిన ఇషా చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కుమ్మేయడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుంది. అయితే ఈ ఏజ్ లో ఈ ట్రీట్ మాత్రం ఊహించనిది.