ఎన్టీఆర్ అభిమాని ట్వీట్ కు స్పందించిన కేజీఎఫ్ డైరెక్టర్

0

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కేజీఎఫ్ 2’ సినిమా షూటింగ్ బెంగళూరులో పూర్తి అయ్యింది. గత నెలలో బెంగళూరులో షూటింగ్ ప్రారంభించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో హైదరాబాద్ లో కేజీఎఫ్ 2 షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా ట్వీట్ చేశాడు. హైదరాబాద్ లో తర్వాత అంటూ ఆయన చేసిన ట్వీట్ కు తెలుగు నెటిజన్స్ విపరీతంగా స్పందించారు. కేజీఎఫ్ 2 టీంకు హైదరాబాద్ కు స్వాగతం అంటూ ట్వీట్టర్ లో ఆహ్వానం పలికారు. కొందరు ఎన్టీఆర్ అభిమానులు తెలుగులో సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. ఒక ఎన్టీఆర్ అభిమాని చేసిన ఫన్నీ ట్వీట్ కు అంతకు మించిన ఫన్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ సమాధానం ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది.

హైదరాబాద్ కు వెళ్లబోతున్నట్లుగా ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ కు ఒక ఎన్టీఆర్ అభిమాని స్పందిస్తూ… హైదరాబాద్ కు వచ్చాక ఒక సారి కాల్ చేయండి అన్న.. తారక్ అన్నను కలిసి కథను చర్చించేందుకు వెళ్దాం అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు సమయస్ఫూర్తితో ప్రశాంత్ నీల్ సమాధానం చెబుతూ మీరు ట్వీట్ లో మీ నెంబర్ ఇవ్వడం మర్చిపోయారు అంటూ ట్వీట్ చేశాడు. ఇద్దరి ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ వెంటనే వచ్చే ఏడాదిలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.