ఈసారి ఉపాసనకు తన ఫిల్టర్ కాఫీని రుచి చూపించిన సామ్

0

యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కోసం సమంత మరియు ఉపాసనలు వారం వారం ఒక రెసిపీని అది కూడా ఆరోగ్యవంతమైన రుచికరమైన రెసిపీని ప్రేక్షకులకు అందిస్తున్నారు. గత వారం ప్రత్యేకమైన ఇడ్లీని ఉపాసనకు చేసి చూపించిన సమంత ఈ వారంలో ఉపాసనకు రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన ఫిల్టర్ కాఫీని తయారు చేసి చూపించింది. రుచికరమైన కాఫీను తయారు చేస్తూనే సమంత మరియు ఉపాసనలు చాలా సరదా ముచ్చట్లు పెట్టుకున్నారు. సమంత మరియు ఉపాసనలు అందించిన హెల్త్ టిప్స్ మరియు వారి వ్యక్తిగత విషయాలు గత రెండు వారాల మాదిరిగానే ఈ వారం కూడా వైరల్ అవుతున్నాయి.

సమంత ఈ వారం వేగాన్ ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ ఫుడ్డింగ్ ను చేశారు. ఈ కాఫీ కోసం ముందు రోజు కొబ్బరి పాలు.. డార్క్ కొకోవా పొడి.. ఫిల్టర్ కాఫీ డికాక్షన్.. వెనీలా.. మాపుల్ సిరప్.. సబ్జా గింజలను ఒక పరిధిలో మిక్స్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. సమంత వాటిని ముందు రోజు పెట్టకోవడం వల్ల సులభంగా ఉపాసనకు ఫిల్టర్ కాఫీ రెసిపీని చూపించింది. మొత్తానికి ఈ మెగా మరియు అక్కినేని కోడళ్ల వంటింటి సందడి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరి పార్టిషిపేషన్ తో యువల్ లైఫ్ కు మంచి పాపులారిటీ దక్కింది.