మోక్షం రాదంటూ శృంగారం గురించి చెప్పిన డాషింగ్ డైరెక్టర్..!!

0

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే అభిమానులలో ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. పూరీ ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత చాలా మంది హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి వారిని స్టార్ హీరోలను చేసిన ఘనత కూడా ఉంది. అందుకే మధ్యలో కొన్ని ప్లాపులు వచ్చిన పూరి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవలే పూరి మళ్లీ సూపర్ హిట్ అందుకున్నాడు. ’ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ హిట్ కొట్టడమే కాకుండా.. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో రామ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి. ఇక ప్రస్తుతం పోడ్ కాస్ట్ లో ఎవరు ఊహించని విధంగా తన అభిప్రాయాలూ ఆలోచనలను బయట పెడుతున్నాడు. తాజాగా శృంగారం గురించి పూరీ స్పందించాడు. మన పూర్వీకులతో పోలిస్తే ఒక విధంగా మనం సెక్స్ చేయనట్లేదు. ఈ ప్రపంచానికి శృంగారం అంటే ఏమిటో తెలిపింది. కామసూత్ర ద్వారా వీలైనంత జ్ఞానం అందుకొని ఆ తరువాత శృంగారం చేయమని మన పూర్వుకుల అభిప్రాయం.

కానీ మనం ఆ విషయం తెలుసుకునే లోపే చాలా యాంగిల్స్ మిస్ అయిపోయమని ఆలోచిస్తాము. నిజానికి వాత్సాయన ఏం చెప్పాడు అనేది పెద్దగా పట్టించుకోము. కామసూత్ర అనేది ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్. మన పూర్వీకులు చేయని యాంగిల్ లేదు. వారు చేసిందంతా దేవాలయాల మీద బొమ్మల రూపంలో కనిపిస్తూనే ఉంది. ఆ బొమ్మలు కామవాంఛలు తీరాకే గుడిలోకి రావాలని అప్పుడే మోక్షం లభిస్తుందని చెప్తాయి. వయసులో ఉన్నపుడే శృంగారంపై మోజు పోవాలి. అప్పుడే కెరీర్ లో సక్సెస్ అవుతాం. బ్యాంకాక్ షూటింగ్ అనగానే ఫస్ట్ రెండు రోజులు రెచ్చిపోతారు. ఆ తరువాత సైలెంట్ అయిపోతారు. కానీ మరో దేశానికి వెళ్లినప్పుడు వ్యభిచారం నేరం అంటే ఒక్కరికి కూడా నిద్ర పట్టదు. శృంగారం గురించి మాట్లాడితే ఇప్పటికి మనం బయపడుతున్నాం కానీ పూర్వికులు మాట్లాడేసారు. అందుకే ఎవరికి ఇక్కడ సరిగ్గా మోక్షం లభించడం లేదు. మధ్యలోనే పోతారు. ధర్మార్ధ కామ డెత్” అంటూ డాషింగ్ డైరెక్టర్ క్లాస్ ఇచ్చాడు. యూత్ అర్ధం చేసుకోవాలని ఆయన ఉద్దేశం. చూడాలి మరి పూరీ మాటలు యూత్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..!