సుశాంత్ హత్యకు రియా `ఇద్దరు డాడీ`ల స్కెచ్?

0

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. సుశాంత్ కేసుకు సంబంధించి అనుమానమున్న ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న సీబీఐ అధికారులు….సుశాంత్ కేసులో అనుమానితులందరినీ విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న రియా చక్రవర్తితో పాటు పలువురి పై సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. మరో వైపు రియా చక్రవర్తికి ప్రముఖ నిర్మాత మహేష్ భట్ కి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని సుశాంత్ మరణానికి మహేష్ భట్ కు లింక్ ఉందని సోషల్ మీడియా లో పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మహేష్ భట్ పై సుశాంత్ సింగ్ సన్నిహితుడు సుశాంత్ జిమ్ పార్ట్నర్ సునీల్ శుక్లా సంచలన ఆరోపణలు చేశారు. రియా తండ్రి డాక్టర్ ఇంద్రజిత్ చక్రవర్తి తండ్రి రియా మరో తండ్రి గా ఫీల్ అయ్యే మహేష్ భట్ లు కలిసి సుశాంత్ హత్యకు కుట్ర పన్నారంటూ సునీల్ శుక్లా షాకింగ్ కామెంట్స్ చేశారు.

జాతీయ మీడియా ఛానెల్ టైమ్స్ నౌ నిర్వహించిన లైవ్ షో లో పాల్గొన్న సునీల్ సంచలన విషయాలు వెల్లడించారు. సుశాంత్ హత్యకు రియా చక్రవర్తి సొంత తండ్రి ఇంద్రజిల్ ‘షుగర్ డాడీ’ మహేష్ భట్ ప్లాన్ చేశారని ఆరోపించారు. సుశాంత్ ను హత్య చేసి ఆ తర్వాత ఉరి వేశారని ఆరోపించారు. సుశాంత్ ఇంట్లో సుశాంత్తో పాటు అతని ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ పిథాని కుక్ నీరజ్ మరియు మేనేజర్ దీపేష్ సావంత్ ఉన్నారని ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వీరిని విచారణ జరిపితే అసలు నిజాలు బయటకు వస్తాయని వెల్లడించారు. తన తండ్రి ఇచ్చిన మందులను సుశాంత్ వేసుకునేలా రియా ప్రేరేపించిందని సుశాంత్ ఇంటి నుంచి రియా వెళ్లిన తర్వాత సుశాంత్ ఇంట్లోని వ్యక్తి సుశాంత్ కు మెడిసిన్ ఇచ్చారని సునీల్ ఆరోపించారు. సుశాంత్ కు మానసికంగా ఎటువంటి ఇబ్బంది లేదని మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ మాత్రమే సుశాంత్ తీసుకునేవారని వెల్లడించారు. కాగా సుశాంత్ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రియా చక్రవర్తి ఆమె కుటుంబం తో పాటు సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాలను సీబిఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.