వివాహితలకు పూరి చెప్పిన చేదు జీవిత సత్యం

0

డాషింగ్ డైరెక్టర్ ఈమద్య కాలంలో పూరీ మ్యూజింగ్స్ పేరుతో జీవిత సత్యాలను కొన్ని రహస్యాలను ప్రపంచంలోని అనేక విషయాలను తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయన చెబుతున్న విషయాలు చాలా వరకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఎన్నో తెలియని విషయాలను ఆయన ఫాలోవర్స్ తెలుసుకుంటున్నారు. ఆయన చెబుతున్న కొన్ని సత్యాలు.. కొన్ని విషయాలు కొందరిని మింగుడు పడటం లేదు. అయినా కూడా తాను అనుకున్నది చెప్పాలనుకున్నది చెప్పేస్తూనే ఉన్నాడు. ఆయన తాజాగా భార్య భర్తల బంధం గురించి ముఖ్యంగా భర్త విషయంలో భార్య ఎలా ఉండాలనే విషయాన్ని చెప్పాడు. వినడానికి కాస్త కఠువుగా ఉన్నా కూడా ప్రతి ఒక్క వివాహిత ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎవ్వరు ఏడ్చే అవకాశం ఉండదు.. గొడవలు కూడా చాలా వరకు తగ్గుతాయి అనిపిస్తుంది.

ఇంతకు వివాహితలను ఉద్దేశించి ఏమన్నాడంటే.. జీవితంలో పర్ ఫెక్ట్ భర్త అనేవాడు దొరకడు. నాకు అలాంటి భర్త ఇలాంటి భర్త కావాలని కోరుకుంటే ఖచ్చితంగా సమస్యల్లో పడతారు. మొగుడిపై పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకుంటే ఖచ్చితంగా కన్నీరు మిగులుతుంది. మీ లైఫ్ లో ఎక్కువగా గడిపేది భర్తతోనే. ఎక్కువ సమయం ఆయనతో ఉండటం వల్ల ఏదో ఒక విషయంలో గొడవ వస్తూనే ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పి చేస్తాడు.. కొన్ని చెప్పకుండా చేస్తాడు.. మరికొన్ని రహస్యంగా చేస్తాడు అప్పుడు ఖచ్చితంగా మీకు కోపం వస్తుంది. అవే తప్పులు మీ నాన్న చేసి ఉంటాడు. వాటి వల్ల మీ అమ్మ కూడా పలు సందర్బాల్లో ఏడ్చి ఉంటుంది.

ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి మీ అమ్మ ఎలా అయితే మీ నాన్నను క్షమించిందో మీరు కూడా మీ భర్తను క్షమించండి. మీ పక్క ఇంటి వదిన గారికి మీ ఏడుపు చూడకుంటే నచ్చదు. అలాంటి వారి మాటలు విని భర్తతో గొడవ పడకూడదు. ఆమె మొగుడు ఏమీ శ్రీరామ చంద్రుడు కాదు. ఆ ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. మొగుడు తప్పు చేసిన సమయంలో మీ అన్నయ్యనో లేదా నాన్ననో తప్పు చేశాడు అన్నట్లుగా భావించి క్షమించి వదిలేస్తే భర్త వల్ల ఏడుపులు ఉండవు అంటూ పూరి వివాహితలకు జీవిత సత్యంను తెలియజేశారు. కాస్త కఠినంగా ఇబ్బందిగా ఉన్నా పూరి మాటలు జీవితంలో చాలా ఉపయోగపడుతాయి అనిపిస్తుంది కదా..!