అందగాడు శోభన్ బాబుగా ఆయన దొరకడం కష్టమే

0

లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ సక్సెస్ కావడంతో ఇప్పుడు హీరోల జీవిత కథల్ని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా పురుచ్చితలైవి జయలలిత జీవిత కథని ఏ.ఎల్. విజయ్ `తలైవి` పేరుతో కంగన ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో నట భూషణ్ శోభన్ బాబు జీవిత కథని తెరపైకి తీసుకురాబోతున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ బయోపిక్ లో శోభన్ బాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇది అంత ఈజీగా వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు. ఎందుకంటే ఓ బయోపిక్ ని తెరపైకి తీసుకురావాలన్నా.. అది ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలన్నా అందులో ఆకట్టుకునే అంశాలు… ఇబ్బందికర అంశాలు వుండాలి. జీవితం అనేది ఉత్థానపతనాల కలయిక. దానిని యథాతథంగా చూపిస్తేనే కిక్కు. శోభన్ బాబు జీవితంలో అలా ఇబ్బంది పడిన సందర్భాలు పెద్దగా లేవా ఉన్నాయా? అన్నది విశ్లేషించాలి. దీంతో కథలో కాన్ ఫ్లిక్ట్ లేకపోతే చూసే వారికి పెద్దగా ఇంట్రెస్ట్ వుండదు.

ఇక శోభన్ బాబు తనని అవమానించారని ఓ దశలో హీరోగా నటిస్తున్న క్రమంలోనే ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయారు. సినిమాల్లో నటించడానికి అయిష్టతని ప్రదర్శించారు. అంతలా ఆయనని అవమానించింది ఎవరు? అన్న కోణంలో సినిమా తీయొచ్చు కానీ ఏమంతగా ఆసక్తికరంగా వుడక పోవచ్చు. ఇదే చాలా మందిని తొలిచివేస్తోంది. ఆకట్టుకునే అంశాలు లేనప్పుడు బయోపిక్ తీయడం అంత మంచిది కాదని చర్చ జరుగుతోంది.

ఒక సెక్షన్ లో విచిత్రమైన చర్చ కూడా సాగుతోంది. శోభన్ బాబు జీవితంపై సినిమా తీయడం సరైనదేనా? అని ఓ ఆర్టిస్టును అడిగితే.. నీ లైఫ్ లో నా లైఫ్ లో ఎమోషన్ లేదా? సామాన్యుల జీవితాల్లోనే బోలెడంత ఎమోషన్.. శోభన్ బాబుకు ఉండదంటావా? నీ పైనా నా పైనా బయోపిక్ లు తీసి బ్లాక్ బస్టర్లు కొట్టొచ్చు తెలుసా? తీసేవాడిలో దమ్ముండాలి.. అంటూ ముక్తాయించారు.