అవినాష్ అరియానా తో నూ ట్రాక్ నడిపిస్తున్నారు

0

బిగ్ బాస్ చప్పగా సాగితే ప్రేక్షకులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే ప్రతి రోజు ఒక గొడవ లేదంటే రొమాంటిక్ సీన్స్ ను పండించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటి సభ్యులు రొమాంటిక్ గా మాట్లాడుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. మొన్నటి వరకు మోనాల్ తో అభిజిత్ మరియు అఖిల్ లు మాట్లాడే మాటలు వేసిన టీం ఇప్పుడు వారి మద్య చిన్న చిన్న గొడవలు వచ్చిన కారణంగా కొత్త జంట కోసం వెదుకుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్ మరియు అరియానాల మద్య జరిగిన చిన్న సరదా రొమాంటిక్ సన్నివేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

అరియానాతో అవినాష్ రొమాంటిక్ యాంగిల్ లో మాట్లాడుతున్నాడు అంటూ వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున ఇప్పటికే వారిద్దరి మద్య ఏదో జరుగుతుంది అనే వాతావరణం కల్పించాడు. ప్రేక్షకులు కూడా అదే ఉద్దేశ్యంతో ఉండగా వారిద్దరి మద్య ఏం జరిగినా కూడా ఏదో ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. హౌస్ లో ఎక్కువగా అరియానా కలిసింది అంటే అది అవినాష్ తో అని చెప్పుకోవచ్చు. ఆమె మొన్నటి కెప్టెన్సీ టాస్క్ లో కూడా అవినాష్ కు అరియానా విపరీతంగా సపోర్ట్ చేసింది. ఆమె ఎంకరేజ్ మెంట్ తో అంత సేపు అవినాష్ ఉన్నాడు అనడంలో సందేహం లేదు.

ఇక నిన్నటి ఎపిసోడ్లో అరియానాకు అవినాష్ మేకప్ వేశాడు. అవినాష్ తో ఎందుకు మేకప్ వేయించుకుంది అనే విషయం పక్కన పెడితే ఇద్దరు మాత్రం కొద్ది సమయం ఫుటేజ్ ఇచ్చారు. ఇద్దరికి సంబంధించి ఎప్పుడు కాంబోలు ఉన్నా కూడా ఎడిటర్స్ వదలకుండా వేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో మేకప్ కు సంబంధించి అవినాష్ మరియు అరియానాల గురించి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున మరింత కనెక్షన్ కలిపేలా మాట్లాడుతాడు. దాంతో అప్పుడు వారిద్దరి మద్య మరింతగా ఏదో జరుగుతుందని ప్రేక్షకులు అనుకునేలా చేస్తారు. మొత్తానికి అవినాష్ కామెడీ చేయడంతో పాటు ఇలా ట్రాక్ కూడా నడిపిస్తున్నాడు అంటూ ప్రేక్షకులకు అతడి గురించి ఒక అంచనాకు వచ్చేలా చేస్తున్నారు.