‘పుష్ప’ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..!

0

డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప”. కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ జరుగుతోంది. బన్నీ సెట్స్ లో అడ్డుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా షూటింగ్ కోసం బన్నీ తెల్లవారుజామున 4 గంటలకి కసరత్తులు చేసి 5 గంటలకు రెడీ అవుతున్నాడట. ఉదయం 6 గంటకు తొలి షాట్ పెడుతున్నారట. దట్టమైన ఫారెస్ట్ లో చలిలో టీమ్ మొత్తం అష్టకష్టాలు పడుతూ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే సుక్కు పర్ ఫెక్షన్ కోసం రోజుకి ఓ సీన్ తీయడం గగనంగా మారిందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ మూవీ ఎక్కువ భాగం షూటింగ్ అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. బన్నీ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడే మొరటు లారీ డ్రైవర్ ‘పుష్ప రాజ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.