రచయిత వేంపల్లి ఆరోపణలపై ‘పుష్ప’ మేకర్స్ స్పందిస్తారా…?

0

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ”ఆచార్య” సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజేష్ మండూరి అనే రైటర్ కమ్ డైరెక్టర్ ‘ఆచార్య’ స్టోరీ తనదేనని.. మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఈ స్టోరీ వినిపించానని.. ఇప్పుడు అదే కథతో కొరటాల శివ సినిమా తీస్తున్నాడని ఆరోపించాడు. దీనిపై స్పందించిన కొరటాల శివ మరియు ‘ఆచార్య’ మేకర్స్ రాజేష్ నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా ఈ వివాదంపై స్పందిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

”ఆచార్య పై రాజేష్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు అసత్యం. మేము అతని కథకు ‘అన్నయ్య’ అనే పేరు పెట్టాలని కొరటాల శివకు తెలియజేశామని చెప్పడం అబద్దం. అతని అసత్య ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. గత ఏడాది కాలంలో మేము భరత్ కమ్మ(డియర్ కామ్రేడ్).. రితేష్ రానా(మత్తువదలరా).. బుచ్చిబాబు సానా(ఉప్పెన) వంటి కొత్త దర్శకులతో సినిమాలు నిర్మించాం. రాజేష్ మాకు వినిపించిన కథ బాగుంటే అతనితో కూడా సినిమా నిర్మించేవాళ్లం. కథ బాగాలేకపోవడంతో అతని కథను రిజెక్ట్ చేశాం. స్టోరీ బ్యాడ్ అయినప్పుడు ఆ కథతో వేరే వారికి సినిమా నిర్మించాలని ఎందుకు చెబుతాం? ఎథిక్స్ ప్రిన్సిపుల్స్ కలిగిన వ్యక్తిగా దర్శకుడిగా రచయితగా కొరటాల శివ మంచి పేరు తెచ్చుకున్నారు. తన ప్రతి సినిమాలో సామాజిక ప్రయోజనం చూసే కొరటాల శివగారిపైనా మాపైనా ఎటువంటి ఆధారాలు లేకుండా అర్థరహితమైన ఆరోపణలు చేయడం సరికాదు. మీడియాలో రాజేష్ చేసిన ఆరోపణలు ఖండించడంతో పాటు ఆయనపై తగిన చర్యలు తీసుకుంటాం. రాజేష్ చేసిన చీప్ జిమ్మిక్కులను.. అతని ఆరోపణలను అందరూ ఇగ్నోర్ చేయాలని కోరుకుంటున్నాం” అని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘పుష్ప’ సినిమాపై కూడా కాపీ ఆరోపణలు వచ్చాయి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనుంది. ఇప్పటికే రిలీజైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ తో ఈ స్టోరీపై ఓ ఐడియా వచ్చింది. ఇప్పుడు దీనిపై ప్రముఖ రచయిత సాహిత్య అకాడమీ యువ పురష్కార గ్రహీత డా. వేంపల్లి గంగాధర్ తన పుస్తకం మరియు వ్యాసాల ఆధారంగా ‘పుష్ప’ రూపొందిస్తున్నారని ఆరోపించాడు. తాను రాసిన ‘తమిళ కూలీ’ కథ మరియు ‘ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు’ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని ఫేస్ బుక్ లో ఘాటుగా స్పందించారు. ఐతే మైత్రీ మూవీ మేకర్స్ దీనిపై స్పందించలేదు. మరి ఇప్పటికైనా కొరటాల శివ వలె మీడియా ముందుకు వచ్చి ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ఈ వివాదంపై స్పందించి సమస్యను పెద్దది అవకముందే జాగ్రత్త పెడతారేమో చూడాలి.