రంపచోడవరంలో గంధపు చక్కల స్మగ్లర్ల వేట!

0

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం పలు అటవీ ప్రదేశాలని పరిశీలించిన టీమ్ ఫైనల్ లొకేషన్ ని ఎట్టకేలకు లాక్ చేసింది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 2 నుంచి రంపచోడవరం- మారేడుమిల్లి అడవుల్లో జరగబోతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా కావడంతో ముందు ఈ చిత్రాన్ని కేరళ అడవుల నేపథ్యంలో చిత్రీకరించాలనుకున్నారు.

కరోనా కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత వికారాబాద్ అడవుల్లో అయితే సిటీకి చాలా దగ్గరగా వుంటుందని బన్నీకి ఎలాంటి ఇబ్బంది వుండదని భావించారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రంపచోడవం వెళ్లడమే కరెక్ట్ అని భావించి మళ్లీ మనసు మార్చుకున్నారు. కేరళకే వెళ్లాలని ఫిక్సయ్యారు. అయితే అక్కడ కరోనా తీవ్రరూపం దాల్చడంతో రంపచోడవరమే వెళ్లాలని ఫైనల్ గా నిర్ణయించుకున్నారు. రంప చోడవరం.. మారేడుమిల్లి గోదావరి పరిసరాల్లోనే ఉన్న సంగతి తెలిసినదే.

అక్కడ కొంత షూటింగ్ చేసిన తరువాత కేరళ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. రంపచోడవంరం- మారేడుమిల్లి అడవుల్లో నెల రోజుల పాటు యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తారట. అంతే కాకుండా హీరో.. హీరోయిన్ లకు సంబంధించిన కీలక ఘట్టాల్ని కూడా అక్కడే పూర్తి చేయాలనుకుంటున్నారట. ఇందు కోసం రష్మికని కూడా రంపచోడవరం తీసుకెళుతున్నట్టు తెలిసింది. మైత్రీ మూవీమేకర్స్ తో పాటు ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తోంది.