వేడెక్కిస్తున్నా కానీ రాశీఖన్నా కెరీర్ ఖాళీయేనా?

0

ఎంతగా హీటెక్కించినా గ్లామర్ డాళ్ రాశీఖన్నా కెరీర్ మాత్రం ఊపందుకోవడం లేదు. ఒకసారి గ్రాఫ్ పరిశీలిస్తే రాశీ ఇంకా తన స్థాయిని పెంచుకోవడంలో ఎందుకు వెనకబడిందో అర్థమైపోతుంది. అవసరాల శ్రీనివాస్ – నాగశౌర్య బృందంతో చేసిన `ఊహలు గుస గుస లాడే`.. సాయి ధరమ్తేజ్తో చేసిన సుప్రీమ్.. ప్రతిరోజు పండగే`.. వరుణ్ తేజ్ తో తొలి ప్రేమ చిత్రాలు తప్ప తెలుగులో ఇప్పటి వరకు రాశిఖన్నాకు సాలీడ్ హిట్ పడలేదు. బెంగాల్ టైగర్- జై లవకుశ- వెంకీ మామ వంటి చిత్రాల్లో నటించినా రావాల్సినంత గుర్తింపు క్రేజ్ రాశికి రాలేదు.

ఇక క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో చేసిన `వరల్డ్ ఫేమస్ లవర్` పెద్ద డిజాస్టర్గా నిలిచింది. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో రాశిఖన్నా కోలీవుడ్ కు మకాం మార్చినట్టు కనిపిస్తోంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ పై మనసు పారేసుకుందీ ఢిల్లీ సుందరి.

రాశీ నటించిన జిల్.. బెంగాల్ టైగర్ వంటి చిత్రాల్లో హాట్ హాట్ గా అందాల ఆరబోతతో షో చేసినా పెద్దగా రాశికి కలిసి వచ్చింది అంటూ ఏమీ లేదు. నితిన్ సరసన ఎన్నో అంచనాలు పెట్టుకున్న శ్రీనివాస కళ్యాణం అంతే పెద్ద డిజాస్టర్ అయ్యింది. తెలుగులో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా లేకపోవడంతో తమిళ చిత్రాల్లో అదృష్టం పరీక్షించుకుంటోంది. సుందర్ సి `అరణ్మై 3`.. సిద్ధార్ధతో `సైతాన్ కా బచ్చా వంటి హారర్ చిత్రాల్లో నటిస్తోంది. కానీ ఇవన్నీ కోవిడ్ వల్ల రిలీజ్ కి రాకపోవడంతో రాశీ ప్రభ మసకబారుతోంది. అయితే ఇదిగో ఇలా సోషల్ మీడియాల్లో హీట్ పెంచే ఫోటోషూట్లతో మాత్రం టచ్ లో ఉంది.