లూజ్ షర్ట్ లో రాశీ కిల్లింగ్ లుక్

0

గత కొంతకాలంగా రాశీ ఖన్నా కెరీర్ యూటర్న్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలుత తెలుగు సినీరంగంలో వరుస సినిమాలతో బిజీ అయిన ఈ భామ ఉన్నట్టుండి తమిళ సినీరంగంలో ఫుల్ బిజీ అయిపోవడం చర్చకు వచ్చింది. తెలుగు లో కంటెంట్ తనకు రుచించడం లేదా? లేకపోతే అవకాశాలు ఆశించినన్ని రావడం లేదా? అంటే.. రాశీ ఆలోచనలు పూర్తి వైవిధ్యంగా ఉన్నాయని అర్థమవుతోంది.

ఇక తెలుగుతో పోలిస్తే తమిళంలో కథానాయికలకు నటించే స్కోప్ ఎక్కువ. అక్కడ ఎంచుకునే పాత్రలు అంతే సజీవంగా లైఫ్ ని ఇచ్చేవిగా ఉంటున్నాయి. నేటివిటీ స్థానియ యాస భాషతో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కథల్ని రాశీ ఎంపిక చేసుకుంటోందని కూడా అర్థమవుతోంది.

ఇక రాశీ ఖన్నా ఏ ఇండస్ట్రీలో ఉన్నా తనకు సౌత్ అంతటా ఫ్యాన్సున్నారు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. వైట్ లూజ్ షర్ట్.. టైట్ స్కిన్నీ లెగ్గిన్ తో రాశీ ఇదిగో ఇలా ఆరుబయట కనిపించింది. ఆ బ్లాక్ డఫెట్ బ్యాగ్.. లెదర్ బూట్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఆ స్టన్నింగ్ లుక్ కి ఫ్యాన్స్ ఫుల్ చిలౌట్ అయిపోతున్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే..ప్రస్తుతం తమిళంలో రాశీ చేతిలో మొత్తం నాలుగు చిత్రాలున్నాయి. సుందర్ సి `అరణ్మై3`.. విజయ్ సేతుపతితో `తుగ్లక్ దర్బార్`… సిద్ధార్ధ్ తో `సైతాన్ కా బచ్చా` చిత్రాలతో పాటు `మేధావి` చిత్రాల్లో నటిస్తోంది.