బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించగా ఫైనల్ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గెస్ట్ గా హాజరు అయ్యాడు. విజేతగా నిలిచిన రాహుల్ కు చిరు చేతుల మీదుగా ట్రోఫీని నాగార్జున ఇప్పించారు. ఇక ఈ సీజన్ లో విజేత ఎవరు అనే విషయం పక్కన పెడితే ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరై ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ చిరంజీవి వచ్చిన కారణంగా మళ్లీ ఈ సీజన్ కు కూడా ఆస్థాయి గెస్ట్ ను తీసుకు వచ్చేందుకు నాగార్జున ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు నాగార్జున కూడా మహేష్ బాబు.. అల్లు అర్జున్.. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా.. జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. హీరోలు మాత్రమే కాకుండా ఒక్కరు ఇద్దరు దర్శకుల పేర్లను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత సీజన్ ఎప్పటికి గుర్తు ఉండేలా ఫైనల్ ఎపిసోడ్ కు చిరంజీవి వచ్చి సందడి చేశాడు. కనుక ఈ సీజన్ లో కూడా ప్రముఖ స్టార్ ను తీసుకు వచ్చి ఫినాలే ఎప్పటికి గుర్తు ఉండేలా చేయాలని నాగార్జున భావిస్తున్నాడట.

కేవలం గెస్ట్ విషయంలోనే కాకుండా ఆ రోజు స్టేజ్ షో ను ప్రముఖ స్టార్స్ తో చేయించాలని కూడా భావిస్తున్నారు. సమంత ఒక వీకెండ్ ఎపిసోడ్ కు హోస్ట్ గా వ్యవహరించిన కారణంగా ఆమెను మళ్లీ స్టేజ్ పై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే బిగ్ బాస్ స్టేజ్ పై మరోసారి సమంతను ఆమెతో పాటు చైతూను కూడా చూపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మొత్తానికి బిబి4 ఫైనల్ ఎపిసోడ్ ప్రత్యేకంగా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.