శ్రీకృష్ణ నాగశౌర్య – సత్యభామ ఎవరో?

0

యంగ్ హీరో నాగశౌర్య ఈ లాక్ డౌన్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. షూటింగ్ లు లేకుండా ఇంటి వద్దే కూర్చున్న నాగ శౌర్య సమయంను మాత్రం వృదా చేయలేదు అనిపిస్తుంది. ఆ సమయంలో వందల కొద్ది కథలు విన్న ఆయన పలు కథలకు ఓకే చెప్పాడని సమాచారం. ఇప్పటికే మూడు సినిమాలు అధికారిక ప్రకటన వచ్చింది.

ఇప్పటికే నాగశౌర్య హీరోగా ‘వరుడు కావాలెను’ సినిమా ను ప్రకటించారు. షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ‘లక్ష్య’ అనే టైటిల్ తో మరో సినిమాను కూడా ఈ యంగ్ హీరో చేస్తున్నాడు. ఇదే సమయంలో మరో సినిమా టైటిల్ ను కూడా నాగ శౌర్య ప్రకటించాడు. ఈసారి కూడా చాలా క్యాచీ టైటిల్ ను నాగశౌర్య కోసం మేకర్స్ ఎంపిక చేశారు.

అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందబోతున్న నాగ శౌర్య మూవీ కోసం ‘శ్రీకృష్ణ సత్యభామ’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. ప్రముఖ దర్శకుడు ఈ సినిమా వెనుక ఉన్నారు. ఆయన క్యాచీగా ఉండే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ను సూచించాడనే వార్తలు వస్తున్నాయి. భారతంలోని కృష్ణ సత్యభామల ప్రేమ కథ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి ప్రేమ కథనే దర్శకుడు చూపించబోతున్నాడట.

ఈతరంలో శ్రీకృష్ణ సత్యభామల మద్య ప్రేమ కథ ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలంటున్నారు. శ్రీకృష్ణగా నాగశౌర్య నటించబోతుండగా సత్యభామగా ఎవరు నటిస్తారు అనేది చూడాలి. సత్య భామ అంటే చాలా పొగరుతో ఉన్న పాత్ర అయ్యి ఉంటుంది. అలాంటి పాత్రను చేయాలంటే కొత్త వారికి సాధ్యం కాదు. ప్రతిభ ఉన్న వారు అయితేనే దాన్ని చేయగలరు. అందుకే ఈ సినిమా కోసం ఒక పాపులర్ హీరోయిన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.