డిజిటల్లో లస్ట్ బ్యూటీలా చెలరేగుతుందట

0

కథానాయికల చూపు ఓటీటీల వైపు మళ్లుతోంది. భవిష్యత్ అంతా ఈ రంగంలో ఉందనేది ఇప్పటికే స్పష్ఠం అయిపోవడంతో చాలా మంది టాలీవుడ్ కథానాయికలు తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సమంత.. అమలాపాల్ .. నిత్యామీనన్ లాంటి భామలు ఓటీటీల్లో నటిస్తున్నారు.

వీళ్ల బాటలోనే దిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా కూడా ఓటీటీ డీల్ మాట్లాడుకుందని తెలుస్తోంది. వెంకీ మామ -ప్రతి రోజూ పండగే సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన తరవాత స్టార్ హీరోయిన్ గా నెక్ట్స్ లెవల్ అందుకునేందుకు రాశీఖన్నా రకరకాల ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఇంతలోనే క్రైసిస్ ఇలా చెక్ పెట్టేసింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ తో వైఫల్యాన్ని ఎదుర్కోవడం మైనస్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు – తమిళ రెండింటిలో కొన్ని పెద్ద బడ్జెట్ చిత్రాల కోసం మేకర్స్ తో చర్చలు జరుపుతోంది.

సినిమాల వరకే కాదు.. మునుముందో ఓటీటీలోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. తాజా వార్త ఏమిటంటే రాశి త్వరలో తన డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటించేందుకు సంతకం చేసినట్లు సమాచారం. వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారిక ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. వెబ్ వేదికపై లస్ట్ స్టోరీస్ బ్యూటీ కియరా అద్వాణీలా చెలరేగుతుందా? అన్నది చూడాలి.