హీరోయిన్ మూడవ భర్తకు తీవ్ర అస్వస్థత

0

హీరోయిన్.. తమిళ బిగ్ బాస్ ఫేం వనిత విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత రెండు నెలల కాలంగా తెలుగు మీడియాలో కూడా ఈమె గురించి వార్తలు తెగ వస్తున్నాయి. ఈమె మూడవ పెళ్లి ప్రకటన మొదలుకుని తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇచ్చే వరకు ఎన్నో విధాలుగా ఈమె మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈసారి ఒక విషాద సంఘటనతో సోషల్ మీడియా ముందుకు వచ్చి అయ్యో పాపం అంటూ అందరి సానుభూతిని పొందింది.

వనిత విజయ్ కుమార్ మూడవ భర్త పీటర్ ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదట. దాంతో ఇటీవలే ఆయన్ను ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లుగా ఆమె చెప్పింది. దేవుడిపై భారం వేసిన ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా చెప్పింది. ఇలాంటి పరిస్థితులు నాకే రావాలా అంటూ ఎమోషనల్ అయ్యింది. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

పీటర్ త్వరగా కోలుకోవాలంటూ వనిత అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఆమె పెళ్లి విషయంలో వివాదం మెల్లగా సర్దుమణిగింది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ ఇలా పీటర్ ఆరోగ్యం చెడి పోవడంతో వనిత తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నట్లుగా తెలుస్తోంది. పీటర్ ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. కొన్ని రోజుల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషయమై ఏం చెప్పలేమని వైధ్యులు అన్నారట.