బిగ్ బాస్ పై ఎప్పటిలాగే అదే రచ్చ

0

బిగ్ బాస్ ప్రారంభంకు ముందు వివాదాలు అనేవి చాలా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. గత రెండు సీజన్ లు ఆరంభంకు ముందు కూడా వివాదం సాగింది. కొందరు విద్యార్థి సంఘం నాయకులు మరియు మహిళ సంఘాల వారు ఇతర సంఘాల వారు బిగ్ బాస్ వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదని చాలా మంది దీనికోసం సమయం వృదా చేస్తున్నారు. కనుక ఈ షోను నిలిపేయాలంటూ హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కాని షో పై హెచ్ ఆర్ సీ ఎలాంటి చర్యలు తీసుకోవడం కాని నిలిపేయడం కాని చేయలేదు.

ఇక సీజన్ 4 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మళ్లీ రచ్చ మొదలైంది. ఈసారి కూడా విద్యార్థి సంఘం నాయకులు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఇంకా మరికొందరు హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేశారు. ఎలాంటి ప్రయోజనం లేని అలాంటి షో లను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని జనాల్లో తప్పుడు మెసేజ్ వెళ్లే అలాంటి షో లు సమాజానికి మంచిది కాదు అంటూ వారు పేర్కొన్నారు.

వారు మీడియాతో మాట్లాడుతూ యువతను తప్పు పోకడకు అలవాటు చేసే బిగ్ బాస్ వంటి షో ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఏమాత్రం సంహించం అంటున్నారు. షో ప్రారంభిస్తే ఆ తర్వాత కూడా మా పోరాటం సాగుతుందని అంటున్నారు. హెచ్ ఆర్ సీ పై తమకు నమ్మకం ఉందని తప్పకుండా ఈ సారి షో కు బ్రేక్ వేస్తుందనే నమ్మకంను కలిగి ఉన్నామన్నారు. మరి హెచ్ ఆర్ సీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది చూడాలి.